Weight loss tips: సారా అలీ ఖాన్ వెయిట్ లాస్ సీక్రెట్స్, Beauty tips ఏంటో తెలుసా ?

How Sara Ali Khan lost overweight: సారా అలీ ఖాన్.. బాలీవుడ్ హీరోయిన్లలో పరిచయం అక్కర్లేని పేరు. చేసింది అతి కొన్ని సినిమాలే అయినా.. బాలీవుడ్ బ్యూటీగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న హీరోయిన్స్‌లో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. సైఫ్ అలీ ఖాన్‌కి నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకు తాను సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బ్యూటీఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ (Actress Sara Ali Khan).

How Sara Ali Khan lost overweight and her beauty tips : ఇప్పుడు బ్యూటీఫుల్ హీరోయిన్ అనిపించుకుంటున్న సారా అలీ ఖాన్ కూడా సినిమాల్లో రాకముందు ఒకప్పుడు ఎంతో లావుగా ఉండేది. అప్పుడు అలా 96 కిలోల వరకు లావుగా తయారైన సారా అలీ ఖాన్‌ని.. ఇప్పుడు ఇలా స్లిమ్‌గా, ఎంతో ఫిట్‌గా తయారైన సారాని (Sara Ali Khan fitness mantra) చూసిన వాళ్లకు కచ్చితంగా ఓ డౌట్స్ రాక మానదు.

1 /7

సారా అలీ ఖాన్‌ని ముందు నుంచి చూసినవాళ్లకు ఎవరికైనా సరే ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే.. సారాకు ఇంత వెయిట్ లాస్ (Sara Ali Khan weight loss journey) అవడం ఎలా సాధ్యమైందని. (Image courtesy: Instagram )

2 /7

అంతేకాకుండా అసలు సారా అలీ ఖాన్ బ్యూటీ సీక్రెట్స్ (Sara Ali Khan beauty secrets) ఏంటి అని కూడా అనిపించక మానదు. అలాంటి సందేహం వచ్చిన వారికి క్లుప్తమైన సమాధానమే ఈ ఫోటో గ్యాలరీ. (Image courtesy: Instagram )

3 /7

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ (Sara Ali Khan fitness secrets) ఏంటంటే.. నిత్యం గంటన్నరకుపైగా ఎక్సర్‌సైజులతోనే వ్యాయమం చేయడం సారా అలీ ఖాన్‌కి అలవాటు. అందులోనూ ఏరోజుకు ఆరోజు కొత్త కొత్త ఎక్సర్‌సైజెస్ ట్రై చేయడం అంటే సారాకు మరింత ఇష్టం. (Image courtesy: Instagram ) 

4 /7

అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో సారా అలీ ఖాన్ యోగా (Sara Ali Khan doing Yoga) కూడా ట్రై చేసింది. ముఖ్యంగా పవర్ యోగా (Power Yoga) సారా అలీ ఖాన్ వెయిట్ లాస్ జర్నీలో బాగా ఉపయోగపడింది. (Image courtesy: Instagram )

5 /7

కిటో డైట్‌తో (Keto diet) బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించిన సారా అలీ ఖాన్.. అది తనకు అంతగా వర్కౌట్ కాలేదని గ్రహించింది. వెంటనే కిటో డైట్‌కి గుడ్‌బై చెప్పి.. తాను ఎప్పుడూ తీసుకునే రోజు వారి ఆహారంలోనే న్యూట్రియంట్స్ (Nutrients) ఎక్కువగా ఉండేలా చూసుకుందట. (Image courtesy: Instagram )

6 /7

అలా క్రమం తప్పకుండా రోజూ వ్యాయమం చేయడం, పవర్ యోగా చేయడం, స్విమ్మింగ్ చేయడం, కొవ్వు, అధిక కేలరీలు ఉండే ఆహారం కాకుండా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవడం ద్వారా తన అధిక బరువును తగ్గించుకోవడమే కాకుండా శరీరాన్ని అందంగా, ఎంతో సెక్సీగా తీర్చిదిద్దుకున్నానంటోంది సారా అలీ ఖాన్. (Image courtesy: Instagram )

7 /7

అధిక బరువు (Obesity) తగ్గి స్లిమ్‌గా, అందంగా తయారవడం ఒక ఛాలెంజ్ అయితే.. మళ్లీ బరువు (Weight gain) పెరగకుండా ఆ అందాన్ని అలాగే కాపాడుకోవడం కూడా మరో సవాలే. కానీ సన్నగా తయారవ్వాలి, ఇకపై ఎప్పుడూ అలాగే ఉండాలన్న సారా అలీ ఖాన్ సంకల్పం ముందు ఆ సవాలు కూడా చిన్నబోతోంది. (Image courtesy: Instagram )