Relationship Tips: మీ మాజీతో మళ్లీ స్నేహం చేయాలనుకుంటున్నారా? ఇది సరైందా? కాదా?

Relationship Tips: చాలామంది ఈ కాలంలో తమ గర్ల్‌ ఫ్రెండ్‌ లేదా బాయ్‌ ఫ్రెండ్‌తో విడిపోయిన తర్వాత మళ్లీ కలవాలనుకుంటున్నారు అని ఓ నివేదిక తెలిపింది. అయితే, మీరు కూడా మీ ఎక్స్‌తో మళ్లీ కలవాలనుకుంటున్నారా? అది ఎంత వరకు కరెక్ట్‌ తెలుసుకుందాం.
 

1 /6

కొన్ని కారణాల వల్ల కొంతమంది తమ గర్ల్‌ఫ్రెండ్‌ లేదా బాయ్‌ ఫ్రెండ్‌తో విడిపోవాల్సి వస్తుంది. దీనికి ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, కెరీర్‌పరంగా, ఫైనాన్షియల్‌ సమస్యలు ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. అయితే, కొన్ని రోజు తర్వాత వారు మళ్లీ తమ ఎక్స్‌తో స్నేహం పెంచుకోవాలని కోరుకుంటున్నారట.  

2 /6

అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ ఎక్స్‌తో మీరు కలవడం మంచిదా? కాదా? మీరు కూడా మీ మాజీతో స్నేహం చేయవచ్చా? లేదా? తెలుసుకుందాం.  

3 /6

మీ మాజీతో మీరు మళ్లీ మీరు మాట్లాడటం మొదలుపెట్టాలనుకుంటే ముందుగా మీరు వారి నుంచి ఏం కోరుకుంటున్నారు? అది గుర్తుంచుకోండి. మీకు వారినుంచి కావాల్సింది స్నేహమా? లేదా సహాయం మీరు చేయాలనుకుంటున్నారా?  

4 /6

ముఖ్యంగా మీరు మీ ఎక్స్‌తో మళ్లీ స్నేహం చేయాలనుకుంటే ఎల్లప్పుడూ బహిరంగంగానే మాట్లాడాలి. ఎంతకైనా మీరు వారితో కేవలం స్నేహం చేయడానికే ప్రయత్నించండి. మళ్లీ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు.  

5 /6

ఇలా మీరు మళ్లీ మీ ఎక్స్‌తో కలిసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో ప్రధాన అంశం. మీరు ఏ కారణంగా విడిపోయారో ఆ విషయాలను మళ్లీ గుర్తు చేయకపోవడమే మేలు.  

6 /6

అంతేకాదు, ముఖ్యంగా మీ ఎక్స్‌తో మాట్లాడుతున్నప్పుడు మీ కుటుంబం, కెరీర్‌ గురించి కూడా చెప్పాలి. అంతేకాని విడిపోవడానికి కారణమైన అంశాలను మళ్లీ గుర్తు చేయకండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)