Vijay Sethupathi Net Worth 2024: విజయ్ సేతుపతి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే సినిమా ఉప్పెన.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించడమే కాదు నటనలో జీవించాడు. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఆస్తుల విలువలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
Vijay Sethupathi Net Worth 2024: విజయ్ సేతుపతి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు ఆయన తమిళ పరిశ్రమలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరుపొంది.. సినీ రంగంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. విలన్, సైడ్ క్యారెక్టర్, హీరో, కమెడియన్ ఇలా ఒకటి కాదు రెండు కాదు కథ నచ్చితే ఎలాంటి పాత్రలైనా చేస్తానంటాడు. ఇప్పటివరకు విజయ్ తమిళ, తెలుగు చిత్ర సినిమాలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు. గత కొన్ని రోజుల నుంచి విజయ్ సేతుపతి వరస సినిమాల్లో బిజీ బిజీగా అయ్యాడు. అయితే ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విజయ్ సేతుపతి కి అద్భుతమైన క్రేజ్ లభించింది.. కాబట్టి ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 20 నుంచి 50 కోట్ల వరకు రెమ్యూరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి నటించిన అనేక సినిమాలు వరుస రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక సమాచారం. అయితే వీలైనంత తొందరలోనే ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
విజయ్ సేతుపతి సినిమాల్లోనే నటించడం కాకుండా ఇటీవలే తమిళ బిగ్ బాస్ సీజన్ 8కి హోస్ట్ గా కూడా పనిచేస్తున్నారు. ఈ షో ఒక్కదానికే ఆయన దాదాపు 60 కోట్లకు పైగా రెమినేషన్ తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒకపక్క సినిమాల్లో కూడా నటించడంతో ఆయన ఆదాయం విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది.
ఇక ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాల్లోకి వెళితే.. విజయ్ సేతుపతి గతంలో నాలుగు కోట్లకు పైగా విలువ ఉండే మెర్సిడెస్ వాగన్ కారుని కొనుగోలు చేస్తారు. దీంతోపాటు విజయ్ సేతుపతికి బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌కు సంబంధించిన ఒక ఖరీదైన కారు కూడా ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఆయనకు మరికొన్ని కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్ సేతుపతి కి ఆస్తుల్లో భాగంగా ఒక ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ కూడా ఉందట.. అదేదో కాదు రువా పేరుతో హెయిర్ కేర్ బ్రాండ్ ఓనర్ గా విజయ్ సేతుపతి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ హెయిర్ కేర్ సెంటర్ భారత్‌లో అత్యున్నత నగరాల్లో అందుబాటులో ఉంది.
అంతేకాకుండా విజయ్ సేతుపతి కొన్ని యాడ్స్లలో కూడా కనిపిస్తున్నారు. అయితే చిన్న బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ లో నటించిన అందుకు ఆయన ఏకంగా రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా రెమ్యురేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్ద బ్రాండ్లకు సంబంధించిన కంపెనీల యాడ్స్ కి ఇంకా ఎక్కువగానే తీసుకుంటున్నారట.
ఇక విజయ్ సేతుపతి ప్రస్తుత విషయానికొస్తే.. ఆయన గాంధీ టాక్స్ అనే మూవీలో ప్రధాన పాత్రధారులుగా కొనసాగుతున్నారు. ఈ సినిమాపై త్వరలోనే కీలక ప్రకటనను సినీ బృందం విడుదల చేయబోతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా విజయ్ సేతుపతి అనేక మూవీలో విలన్ క్యారెక్టర్ గా కూడా చేస్తున్నారట.