Venus Transit 2022: శుక్రుడి పరివర్తనంతో ఈ 3 రాశుల వారి భవితవ్యమే మారిపోతోంది!

Venus retrograde in Sagittarius: ఎప్పుడు తిరోగమనం చెందే శుక్రుడు.. ఈ సారి నేరుగా మరో రాశిలోకి పరివర్తనం చెందనున్నాడు. మరో 48 గంటల్లో జరిగే ఈ పరిణామంతో కొన్ని రాశుల వారి భవిష్యత్తే మారుతుంది.

  • Jan 27, 2022, 15:18 PM IST

Venus Transit In Sagittarius 2022: గ్రహాలన్నింటిలో శుక్రుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే జనవరి 29న శుక్రుడు రాశి పరివర్తనం చెందనున్నాడు. శుక్రుడు (Venus) నేరుగా ధనుస్సు రాశిలోకి (Sagittarius) పరివర్తనం చెందుతాడు. శుక్రుడు ఈ పరివర్తనం మొత్తం 12 రాశులపై పడుతుంది. శుక్రుడు రాశి పరివర్తనం చెందండం వల్ల 3 రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక 23 రోజుల పాటు అదే ధనుస్సు రాశిలో బృహస్పతి కూడా ఉండటం వల్ల కొన్ని ఈ రాశుల వారికి (Zodiac Signs) శుక్రుడు అదృష్టాలను తీసుకురాన్నున్నాడు.

1 /5

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. శుక్రుడి ఆశీర్వాదం ఉంటే ఆనందం, విలాసం, కీర్తి, శృంగారం, ప్రేమ, అందం వంటి వాటిని పొందవచ్చు. శుక్రుడు వీటన్నింటినీ ప్రసాదిస్తుంటాడు. శుక్రుడి ఆశీర్వాదం ఉంటే జీవితంలోని పలు రంగాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. వృషభం, తుల రాశులకు శుక్రుడు అధిపతి.

2 /5

శుక్రుడి రాశి పరివర్తనం (Venus Transit) మేష రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి విషయంలో విజయం సాధించేందుకు శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. 

3 /5

వృషభ రాశికి (Taurus) అధిపతి శుక్రుడు. ఇక శుక్రుడి రాశి పరివర్తనం వల్ల ఈ రాశి వారికి చాలా లాభాలు చేకూరుతాయి. వీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు. వాటి వల్ల వీరికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. 

4 /5

శుక్రుడి రాశి పరివర్తనం వల్ల మిథున రాశి (Gemini) వారు కూడా చాలా లాభాలు పొందుతారు. వీరికి కొన్ని విషయాల్లో మంచి గౌరవం పొందుతారు. ఇక పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే వివాహం అవుతుంది.

5 /5

శుక్రుడు రాశి పరివర్తనం చెందడంతో కుంభ రాశి (Aquarius) వారికి చాలా మేలు జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక వృద్ధితో పాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది.