Ayodhaya Ram Lalla: అయోధ్యలో భక్తులు తప్పక చూడాల్సిన టాప్ ఫైవ్ ప్రదేశాల వివరాలు ...

Ayodhya: వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామజన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభంగా జరిగింది. రాముడిని దర్శించుకొవడానికి భక్తులు పొటెత్తుతున్నారు.

1 /6

అయోధ్యలో బాలరాముడితో దర్శనంతో పాటు, భక్తులు తప్పకుండా చూడాల్సిన మరికొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదట భక్తులు రామ్ లల్లా మర్యాద పురుషోత్తముడిని విగ్రహాన్ని దర్శించుకోవాలి.  

2 /6

హనుమాన్ గర్హి అనే ప్రదేశం అక్కడ కొండపైన ఉంటుంది. హనుమంతుడు ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నాడని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ హనుమాన్ పాలకుడిగా ఉంటారు.   

3 /6

కనక్ భవన్ ఆలయం హనుమాన్ గర్హి టెంపుల్ కు దగ్గరలో ఉంది. కనక్ భవన్ ను భక్తులు సోనేకా మందరం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీరాముడు, సీతామాతలు కలిసి ఉన్నారని చెబుతుంటారు.  

4 /6

నాగేశ్వర నాథ్ ఆలయం ఆలయం పన్నేండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పౌరాణిక, త్రేతా యుగానికి ముందు ఇక్కడ శివుడు వెలిశాడని చెబుతుంటారు. ఇక్కడ శివలింగం ప్రకాశిస్తూ ఉంటుంది. లవకుశులు ఈ ఆలయం నిర్మించారనిచెబుతారు. 25 అడుగులు ఎత్తైన శిఖరం ఉంది.

5 /6

తులసి స్యారక భవన్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మధ్య యుగానికి చెందిన కవి గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ ను రచించాడని చెబుతారు. ఇక్కడ రాముడి కాలంలోని అనేక సంఘటనల గ్యాలరీలు ఉన్నాయి.

6 /6

అయోధ్య భవ్యరామమందిరంను కులమతాలకు అతీతంగా అందరు దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు కూడా వేలాదిగా భక్తులు వస్తునే ఉన్నారు. వందల ఏళ్ల నాటి కల ప్రధాని మోదీ చేతుల మీదుగా నెరవేరినందుకు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.