Uterus Infection: మహిళల్లో అధికంగా కన్పించే సమస్య గర్భాశయంలో ఇన్ఫెక్షన్. ఫలితంగా శరీరంలో చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఈ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఈ సమస్యను ఎలా గుర్తించాలి. ముఖ్యంగా 4 లక్షణాలు కన్పిస్తే పొరపాటున కూడా నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. వెంటనే వైద్యుని సంప్రదించాలి.
గర్భాశయం అనేది మహిళల్లో రీ ప్రొడక్షివ్ సిస్టమ్లో కీలకమైన భాగం. యుటెరస్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఇన్ఫెక్షన్ అంటే ఎండోమెట్రియాటిస్ అంటారు. ఇదొక విషమ పరిస్థితి. ప్రాణాంతకం కూడా కావచ్చు.
గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉంటే ప్రధానంగా ఈ 4 లక్షణాలు కన్పిస్తాయి. వీటిని తేలిగ్గా తీసుకోకూడదు
దుర్వాసనతో పసుపు లేదా పచ్చ రంగుతో వెజీనా డిశ్చార్జ్ ఉంటే యుటెరస్ ఇన్ఫెక్షన్ అని అర్ధం. డిశ్చార్జ్లో రక్తం మరకలు కూడా ఉండవచ్చు. వెజీనాలో దురద, మంట కూడా మరో కారణం.
గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉంటే 5 లక్షణాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
విపరీతమైన నొప్పి, కడుపు కింది భాగంగా ఉంటుంది. ఇలా ఉంటే యుటెరస్ ఇన్ఫెక్షన్ లక్షణం కావచ్చు.
తరచూ మూత్రం రావడం, లేదా మూత్రం సమయంలో మంట అనేది కూడా యుటెరస్ ఇన్ఫెక్షన్ లక్షణం. యూరిన్లో రక్తం కూడా రావచ్చు
ఇన్ఫెక్షన్ నుంచి రక్షించేందుకు శరీరానికి ఎక్కువ ఎనర్జీ అవసరమౌతుంది. దాంతో అలసట, బలహీనత ఉంటాయి.