Trisha Political Entry: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈయన బాటలోనే ఈయన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ త్రిష కూడా రాజకీయాల్లోకి వెళ్ళబోతుందని సమాచారం. ఇక దీనిపై త్రిష తల్లి కూడా క్లారిటీ ఇచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దళపతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ఇప్పుడు చివరిగా జననాయగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. విజయ్ దళపతి 69 మూవీగా వస్తున్న ఈ సినిమా విజయ్ దళపతి చివరి సినిమా కూడా కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత ఆయన శాశ్వతంగా రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా జననాయగన్ సినిమా టైటిల్ తో పాటు పోస్టర్ కూడా రివీల్ చేశారు. ఆ పోస్టర్లో వెనుక జనంతో కలిసి విజయ్ సెల్ఫీ తీసుకున్నట్లు పోస్టర్ డిజైన్.. చేయడం జరిగింది. ఇక పోస్టర్ కి , టైటిల్ కి పూర్తి న్యాయం చేశారని విశ్లేషకులు కూడా కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా మరొకవైపు గత కొన్నాళ్ళుగా కోలీవుడ్లో విజయ్ దళపతి రూమర్ద్ గర్ల్ ఫ్రెండ్ గా పేరు దక్కించుకుంటోంది త్రిష. అతడితో చాలా చనువుగా తిరుగుతూ వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
అయితే అలాంటి ఈమె విజయ్ తో.. పాటే రాజకీయాల్లోకి ప్రవేశించనుంది అని వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఈ విషయంపై కామెంట్లు చేసింది. త్రిష తల్లి ఉమా కృష్ణన్ మాట్లాడుతూ.. త్రిష రాజకీయాలలోకి రావడం లేదు. ఆమె సినిమాలలోనే కొనసాగుతుంది దయచేసి.. రూమర్స్ స్ప్రెడ్ చేయకండి.. ఇప్పుడు వచ్చే రూమర్స్ అన్నీ కూడా ఆధారాలు లేనివి అంటూ తెలిపింది. మొత్తానికైతే త్రిష రాజకీయ ఎంట్రీ పై ఆమె తల్లి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
ఇకపోతే ఇదివరకే త్రిష, విజయ్ దళపతి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి రాబోతోందని, 2024లో సొంత పార్టీని ప్రకటించి ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తుందని వార్తలు జోరుగా వినిపించాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వార్తలను ఖండించింది.
ఇక త్రిష విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె అజిత్ విదాముయార్చి సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా నటిస్తోంది.