Trisha: చీరలో త్రిష అందాలు..అల్లంత దూరాలా ఆ తారక..

Trisha Photos: త్రిష సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఆమెకి ఇంకా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

  • Feb 23, 2024, 19:07 PM IST
1 /6

తరుణ్ హీరోగా చేసిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ హీరోయిన్ త్రిష. తెలుగులో, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 /6

ముఖ్యంగా ప్రభాస్ హీరోగా చేసిన వర్షం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 

3 /6

వర్షం చిత్రం తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో అలానే యువతరం హీరోలతో నటించి మెప్పించింది.

4 /6

త్రిష హీరోయిన్ గా చేసిన అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాలు ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

5 /6

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్న ఇంకా కూడా ఈ హీరోయిన్ కి అవకాశాలు తగ్గకుండా వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా చేస్తోంది. 

6 /6

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్ర చీరలో ఫోటోలు షేర్ చేసి అభిమానులని ఫిదా చేసింది త్రిష. ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు ‘అల్లంత దూరాల ఆ తారక కళ్ళు ఎదుట నిలిచిందా ఈ తీరగా’ అంటూ సాంగ్ పాడేస్తున్నారు.