IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో అత్యధిక ధర పలికే ఐదుగురు క్రికెటర్లు ఎవరో తెలుసా

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ మరి కొద్దిరోజుల్లో జరగనుంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా ఆక్షన్‌కు రంగం సిద్దమైంది. ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోయింది. దాదాపు 12 వందల మంది ఆటగాళ్లు వేలంపాటకు సిద్ధంగా ఉన్నారు. మరోసారి అన్ని జట్లు కలిపి తుది జాబితా ఇచ్చాక పైనల్ లిస్ట్ రెడీ అవుతుంది. ఈసారి వేలంలో దాదాపుగా 15 కోట్ల వరకూ వేలం పలికే టాప్ 5 క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ మరి కొద్దిరోజుల్లో జరగనుంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా ఆక్షన్‌కు రంగం సిద్దమైంది. ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోయింది. దాదాపు 12 వందల మంది ఆటగాళ్లు వేలంపాటకు సిద్ధంగా ఉన్నారు. మరోసారి అన్ని జట్లు కలిపి తుది జాబితా ఇచ్చాక పైనల్ లిస్ట్ రెడీ అవుతుంది. ఈసారి వేలంలో దాదాపుగా 15 కోట్ల వరకూ వేలం పలికే టాప్ 5 క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
 

1 /5

యజువేంద్ర చహల్. టీమ్ ఇండియా మేటి స్పిన్నర్. అతని ర్యాకింగ్ చూస్తే అతని క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ తెలుస్తుంది. ఆర్‌సీబీ బౌలింగ్ విభాగానికి అంతా తానై ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఆర్‌సిబీ జట్టు అతడిని రిటైన్ చేసుకోకపోవడంతో..వేలంలో మంచి ధర లభించే అవకాశాలున్నాయి.

2 /5

శ్రేయాస్ అయ్యర్. ఈసారి వేలంలో అత్యధిక ధర పలకవచ్చని అంచనా. మిడిల్ ఆర్డర్‌లో మంచి బ్యాట్స్‌మెన్ కాగలడు. ఐపీఎల్‌లో మంచి రికార్డ్ కలిగి ఉన్నాడు. ఈసారి వేలంలో 7-15 కోట్ల పలకవచ్చు.

3 /5

మరో మంచి క్రికెటర్ శార్దూల్ ఠాకూర్. బ్యాటింగ్ తీరును చాలా బాగా మెరుగుపర్చుకున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ..శార్దూల్‌పై ఆసక్తి చూపిస్తున్నా..ఇతర జట్లు కూడా అతడిని వదులుకునే పరిస్థితి లేదు. ఈసారి వేలంలో కచ్చితంగా 10 కోట్లు లభించవచ్చు.

4 /5

టీమ్ ఇండియాకు చెందిన మరో టెర్రిఫిక్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్. ఈసారి వేలంలో ఉన్న ఇషాన్ కిషన్‌కు కచ్చితంగా 7-15 కోట్లు లభించవచ్చు.

5 /5

ఆస్ట్రేలియన్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్. కేవలం ఇతడి విధ్వంసకర ఆటతోనే ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్‌ను తొలిసారిగా గెల్చుకుంది. ఈసారి వేలంలో అందరికంటే ఎక్కువ ధర పలికే అవకాశాలున్నాయి. 12-15 కోట్ల వరకూ పలకవచ్చని అంచనా.