Vitamin B12 Rich Foods: శరీరంలో అత్యంత అవసరమైన పోషకం విటమిన్ బి12. శరీరంలోని నాడీ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో ఉపయోగపడుతుంది. విటమిన్ బి 12 లోపముంటే అలసట, ఎనీమియా, బలహీనత వంటి సమస్యలు ఎదురౌతాయి.
Vitamin B12 Rich Foods: సాధారణంగా విటమిన్ బి 12 మాంసం, గుడ్లలో ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని రకాల శాకాహార పదార్ధాల్లో కూడా విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. తక్షణం మీ డైట్లో ఈ 5 శాకాహార పదార్ధాలు చేరిస్తే విటమిన్ బి12 లోపం తలెత్తకుండా చేయవచ్చు.
మష్రూం మష్రూం చాలామంది ఇష్టంగా తింటుంటారు. ఇందులో కూడా విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.
న్యూట్రిషన్ ఈస్ట్ ఇందులో కూడా విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. ప్రతి ఔన్సు ఈస్ట్‌లో దాదాపు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి 12 ఉంటుంది. పాస్తా, సూపర్, సలాడ్ ఇలాంటివి తీసుకోవాలి.
ఫోర్టిఫైడ్ ఫుడ్స్ కొన్ని రకాల ఫోర్టిఫైడ్ ఫుడ్స్‌లో కూడా విటమిన్ బి12 ఉంటుంది. అంటే విటమిన్ బి12 కృత్రిమంగా లభించే పదార్ధాలు. ఇందులో ఫోర్టిఫైడ్ పాలు, ఫోర్టిఫైడ్ ధాన్యం, ఫోర్టిఫైడ్ న్యూట్రిషన్ ఈస్ట్, సోయా మిల్క్ ఉన్నాయి.
పన్నీరు పన్నీరు కూడా విటమిన్ బి12కు మంచి సోర్స్. ఒక కప్పు పన్నీరులో దాదాపు 0.9 మైక్రో గ్రాముల విటమిన్ బి12 ఉంటుంది.
పెరుగు పెరుగు విటమిన్ బి 12కు మంచి ప్రత్యామ్నాయం. ఒక కప్పు పెరుగులో దాదాపు 1.1 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది. ఇది రోజువారీ అవసరంంలో 15 శాతం అని చెప్పవచ్చు. దీంతోపాటు ప్రోటీన్లు, కాల్షియం, ప్రో బయోటిక్స్ పెద్దఎత్తున ఉంటాయి.