Telangana: రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

Bonalu Holiday 2024: రేపు సోమవారం 29వ తేదీ రాష్టవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా బోనాలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈ హాలిడేను ప్రకటించింది.
 

1 /5

తెలంగాణ బోనాలు అంగరంగ వైభంగా నిర్వహించారు. జూలై 7 నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభించారు. మొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభమవుతాయి. ఏటా ఆషాఢమాసం బోనాలు నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది.  

2 /5

రెండవ బోనం బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మకు సమర్పిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక బోనాల చివరిఘట్టం హైదరాబాద్‌ బోనాలతో పూర్తవుతుంది.  

3 /5

ఈరోజు చివరి ఆషాఢమాసం హైదరాబాద్‌ లాల్‌ దర్వాజ బోనాలు నిర్వహిస్తారు. దీంతో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు పూర్తవుతాయి. మరుసటి రోజు అంబారీ పై అమ్మవారి ఊరెగింపు నిర్వహిస్తారు.   

4 /5

సోమవారం రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని స్కూలు, కాలేజీలకు సెలవు దినం ప్రకటించింది. దీంతో అన్ని పబ్లిక్‌, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ఈరోజు సెలవు పాటించనున్నారు. ఆదివారం, సోమవారం రెండు రోజులు కలిసి వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్రపండుగగా ప్రకటించింది అప్పటి ప్రభుత్వం.  

5 /5

నాటి నుంచి బోనాల పండుగ రోజు ప్రతి ఏటా పబ్లిక్‌ హాలిడే ప్రకటించారు. అయితే, ఈ బోనాలు ఈ ఏడాది ఆగష్టు 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే కాదు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవు దినం.