Samantha vs Konda Surekha: కొండా సురేఖకు మరోసారి ఇచ్చిపడేసిన సమంత..నాకు మద్దతిచ్చింది వాళ్లే

అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్యతో విడాకుల తరువాత తరచూ వార్తల్లో ఉండే సమంత విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద వివాదాన్నే సృష్టించాయి. మొత్తం పరిశ్రమ సమంతకు అండగా నిలిచింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు తాజాగా మరోసారి స్పందించింది. ఏమన్నదంటే..

Samantha vs Konda Surekha: అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్యతో విడాకుల తరువాత తరచూ వార్తల్లో ఉండే సమంత విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద వివాదాన్నే సృష్టించాయి. మొత్తం పరిశ్రమ సమంతకు అండగా నిలిచింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు తాజాగా మరోసారి స్పందించింది. ఏమన్నదంటే..

1 /5

సిటాడెల్ వెబ్‌సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సమంత మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలు, ఇతర ట్రోలింగ్‌లపై స్పందించింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత సిటాడెల్ వెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

2 /5

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఈ రోజుఈ స్థితిలో ఉండటానికి ఎంతో మంది మద్దతు ఉందన్నారు. సినీ పరిశ్రమకు చెందినవారి ప్రేమ, వారికి తనపై ఉన్న నమ్మకమే ఈ స్థాయిలో నిలబెట్టిందని సమంత తెలిపింది. 

3 /5

సినీ పరిశ్రమ ఇచ్చిన మద్దతుతో కష్టాల్ని ఎదుర్కొనగలిగానని సమంత వెల్లడించింది. వారే లేకుంటే కొన్ని పరిస్థితుల్ని అధిగమించేందుకు చాలా సమయం పట్టేదని చెప్పింది. 

4 /5

ఇక ఆన్‌లైన్ ట్రోలింగ్‌ల గురించి ఎక్కువగా ఆలోచించనని తెలిపింది. ద్వేషపూరిత సందేశాలు స్వీకరించినప్పుడు ఆ ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానన్నారు. అలాంటి సందేశాలు పంపించినవారు కూడా అలాంటి బాధను అనుభవించారేమోనని ఆలోచిస్తానన్నారు.

5 /5

ఇప్పుడు శామ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కొండా సురేఖకు మరోసారి గట్టి రిప్లై ఇచ్చేసిందని నెటిజన్లు అంటున్నారు. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x