Tirumala Laddu Controversy Updates: తిరుపతి లడ్డూ వివాదం.. కీలక అప్‌డేట్స్ ఇవే..!

Tirumala Laddu Controversy Latest News: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దూమారం రేపుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిసిందనే ఆరోపణల నేపథ్యంలో భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీవారి లడ్డూపై స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేయడం చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని.. లడ్డూ ప్రసాదం వెనుక పెద్ద కుట్ర జరిగే ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామి వారి ప్రసాదంలో ఇలా జరిగి ఉండదని మరికొందరు అంటున్నారు. తిరుమల స్వామి లడ్డూ వివాదంలో కీలక అప్‌డేట్స్‌ ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /8

ఈ నెల 18న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తిరుమల స్వామివారి నైవేధ్యాల్లో గత వైసీపీ ప్రభుత్వం నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వు వాడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.  

2 /8

గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ నిర్వహించిన ల్యాబ్ నివేదికలో నెయ్యి శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలుగుదేశం పార్టీ ఓ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. చేప నూనె, బీఫ్, పందికొవ్వు ఉన్నట్లు నివేదికలో వెల్లడైందని ఆరోపించింది.  

3 /8

ఈ విషయంపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. శాంపిల్స్‌లో జంతు కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు ల్యాబ్‌లో తేలిందన్నారు. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే పనిలో ఉన్నట్లు చెప్పారు.   

4 /8

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కర్ణాటక నుంచి నందినీ నెయ్యిని వినియోగించవారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టెండర్లు నిర్వహించగా.. తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సరఫరా చేసిన నెయ్యిని ల్యాబ్‌కు పంపించగా.. కల్తీ జరిగిందని టీడీపీ చెబుతోంది.  

5 /8

తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై హైకోర్టును కూడా ఆశ్రయించింది. జ్యూడిషియల్ కమిటీ వేసి విచారణ జరపాలని కోరుతోంది. ఈ నెల 25న కోర్టు విచారణ చేపట్టనుంది.   

6 /8

స్వామి వారి ప్రసాదంగా అందించే లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ నిర్వహించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   

7 /8

స్వామి వారి లడ్డూపై చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై మాజీ సీఎం జగన్ స్పందించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదని ఫైర్ అయ్యారు. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కథ అని అన్నారు.  

8 /8

జూలై 12న శాంపిల్స్‌  తీసుకున్నారని.. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉన్నారని అన్నారు. జూలై 17న NDDBకి నెయ్యి శాంపిల్స్‌ పంపించారని.. ఆ ల్యాబ్ ఆ రిపోర్ట్‌ను జూలై 23న అందజేసిందన్నారు. జూలై 23న రిపోర్ట్‌ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.