Astro Tips: కొత్తగా పెళ్లైన జంట బెడ్రూమ్ లో వీటిని అస్సలు పెట్టుకొవద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Newly married couple: కొత్తగా పెళ్లైన జంటలు తమ జీవితంపై ఎన్నో ఆశలతో ఉంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువ సమయం బెడ్ రూమ్ లోనే కేటాయిస్తుంటారు.

1 /6

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి మార్పుతీసుకొస్తుంది. అప్పటి వరకు ఎలా పడితే అలా తిరిగిన వారు ఒక బాధ్యతతో, సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. అప్పటి వరకు బలాదూర్ గా టైపాస్ చేసిన వాళ్లు కాస్త బాధ్యతతో మెలుగుతారు.

2 /6

జ్యోతిష్య పండితుల ప్రకారం.. కొన్నివస్తువులు ఇంట్లో నెగెటీవ్ ఎనర్జీనీ కల్గజేస్తాయి. అందుకే వీటిని ఇంట్లో అస్సలు ఉండనీయకూడదు. కొత్తజంటలు ఉండే బెడ్రూమ్ లో ఆగిపోయిన గడియారం ను అస్సలు పెట్టకూడదు.

3 /6

పగిలిపోయిన లేదా విరిగి పోయిన పాతవస్తువులు వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుంటుంది. అందుకే వీటిని ఇంట్లో ఉండనీయకుండా బైటపాడేయాలని పండితులు చెబుతుంటారు.

4 /6

ఇక బెడ్ రూమ్ లో.. పనిచేయని ఫోన్ లు, ఫర్నీచర్ ఐటమ్స్ లను ఉండనీయకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో క్రూర జంతువుల బొమ్మలు కూడా పెట్టకూడదు. గదిలో వెలుతురు పుష్కలంగా ఉండేలా చూసుకొవాలి.

5 /6

బెడ్ రూమ్ లో ఎక్కువగా ముండ్లకు చెందిన చెట్లను కూడా ఉంచుకోకూడదు. కొందరు తమ బెడ్ రూమ్ లలో పిల్లులను పెంచుకుంటారు. కానీ దీని వల్ల అశుభమైన ఫలితాలు కల్గుతాయి. 

6 /6

బెడ్ రూమ్ లో ఎంతో నీట్ గా, చుట్టుపక్కల మనమనస్సుకు ఉల్లాసాన్ని ఇచ్చే వస్తువులు మాత్రమే ఉండాలి. ఈ వస్తువులు మాత్రం బెడ్రూమ్ లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకొవాలని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)