Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ తీసుకునే వారిలో కొద్ది మంది మాత్రమే అన్ని విధాల ఆలోచించి తమ అవసరాలకు తగిన విధంగా పాలసీ తీసుకుంటారు. కారు ఇన్సూరెన్స్ తీసుకునే విషయంలో.. చాలామంది తమ కారు ఇన్సూరెన్స్ పాలసీ ట్రాఫిక్ వయోలేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తారు అనే అభిప్రాయం ఉంది.
Car Insurance Tips: వాస్తవానికి సరైన కారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అది కేవలం మీకు, మీ వాహనానికి మాత్రమే కాదు.. మీ వల్ల ఎదుటి వారి వాహనానికి జరిగిన డ్యామేజీని, డ్రైవర్ ఆస్పత్రి ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. అయితే, ఏయే పాలసీ ఏ మేరకు ప్రొటెక్షన్ ఇస్తాయో తెలుసుకుంటే క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Car Insurance Tips: కొత్తగా కారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు, కారు ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండియాలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అనే నిబంధన ఉంది. ( Twitter Photo )
Car Insurance Tips: అయితే, ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే.. కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని కాకుండా అన్నివిధాల పూర్తిగా కవర్ అయ్యేలా కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటేనే ఇన్సూరెన్స్ అసలు ప్రయోజనాలు వర్తిస్తాయని కారు ఇన్సూరెన్స్ గురించి తెలిసిన ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ( Twitter Photo )
Car Insurance Tips: థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి, కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్‌కి తేడా ఏంటనే కదా ఇప్పుడు మీ సందేహం.. యస్ అక్కడికే వస్తున్నాం. కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్‌లో ఇరువర్గాలు కవర్ అవడంతో పాటు ప్రమాదానికి గురైన రెండు పార్టీలకు డ్యామేజీ కవర్ వర్తిస్తాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్, ప్రయాణంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే 24 గంటలపాటు రోడ్ అసిస్టెన్స్, వాహనం చోరీ వంటి అన్ని అంశాలు కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీకి వర్తిస్తాయి. ( Twitter Photo )
Car Insurance Tips: ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు కేవలం ప్రీమియం మాత్రమే కాకుండా క్లెయిమ్ సక్సెస్ రేషియో, నిబంధనలు, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రొసిజర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ఏదైనా ప్రమాదం ఎదురైతే.. ఆలస్యం చేయకుండా వెంటనే క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని నిబంధనలు విధిస్తాయి. ( Twitter Photo )
Car Insurance Tips: ప్రమాదం జరిగిన తరువాత ప్రత్యేకించి ఇన్ని రోజులలో మాత్రమే అన్ని డాక్యుమెంట్స్ తమకు అందితేనే క్లెయిమ్ ప్రాసెస్ మొదలుపెడతాం అని కంపెనీలు కొర్రీలు పెడుతుంటాయి. అందుకే ఆలస్యం చేసే కొద్ది క్లెయిమ్ సెటిల్మెంట్ రిస్క్ పెరుగుతుంటుంది. ( Twitter Photo )
Car Insurance Tips: అలాగే ఏ మేరకు డ్యామేజీ జరిగిందో.. ఆ మేరకే నిజాయితీగా డ్యామేజీని క్లెయిమ్ చేసుకుంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కారు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే ప్రమాదాలు ఎదురైనప్పుడు పెద్దగా ఇబ్బంది లేకుండా పని పూర్తవుతుంది. ( Twitter Photo )