Thick Black Hair: నల్లటి కురులకు నేచురల్ రెమిడీ.. కొబ్బరినూనెలో ఈ పొడి మిక్స్‌ చేసి రాయండి!

Thick Black Hair with coconut oil and coffee: మందపాటి పొడువు జుట్టు కావాలని మార్కెట్‌ నుంచి అనేక ఉత్పత్తులను తీసుకువచ్చి వాడతారు. దీంతో సైడ్‌ఎఫెక్ట్స్‌ తప్పవు. అయితే, ఇంట్లో ఉండే వస్తువులతో కూడా తెల్ల జుట్టుకు చెక్‌ పెట్టి పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉండే రెండు వస్తువులను జుట్టుకు అప్లై చేస్తే చాలు.
 

1 /6

తలస్నానం చేసే ముందు సాధారణంగా ఓ రెండు గంటల ముందు జుట్టుకు ఏదైనా ప్యాక్‌ వేసుకునే అలవాటు ఉంటుంది. కనీసం కొబ్బరి నూనె అయినా జుట్టుకు వాడతారు.   

2 /6

ఈసారి కొబ్బరినూనెలో కాస్త కాఫీ పొడి వేసి జుట్టుకు అప్లై చేయండి. కాస్త సమయం అయిన తర్వాత హెయిర్‌ వాష్‌ చేయాలి. మీ జుట్టుకు సరిపోయే కొబ్బరి నూనె తీసుకుని అందులో రెండు చెంచాల కాఫీ పొడి వేసి తలకు అప్లై చేయాలి.  

3 /6

ఈ నేచురల్‌ రెమిడీతో తెల్లజుట్టు సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. తలకు పట్టించిన ఈ కాఫీ హెయిర్‌ ప్యాక్‌ను సాధారణ నీటితో జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు పొడుగ్గా, నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతుంది.  

4 /6

అయితే, ఈ ప్యాక్‌ను జుట్టుకు పట్టించే ముందు కొబ్బరినూను వేడి చేయాలి. ఈ కాఫీ హెయిర్‌ ప్యాక్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. కాఫీ, కొబ్బరి నూనెతో జుట్టు పొడిబారడం కూడా తగ్గిపోతుంది.  

5 /6

కాఫీ హెయిర్‌ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వాడాలి. కొబ్బరినూనెతో ఈప్యాక్‌ వేసుకోవడం వల్ల జుట్టుకు పునరుజ్జీవనం కూడా అందుతుంది. ఈ ప్యాక్‌ తరచూ ఉపయోగిస్తే మోకాళ్ల వరకు మీ జుట్టు పెరగడం ఖాయం.  

6 /6

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)