Healthy Drinks: ఈ రోజుల్లో గ్యాస్, అజీర్తి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. సరైన జీవనశైలి, ఎక్సర్సైజ్ ఉంటే కడుపు సంబంధిత సమస్యలు రావు. మనం ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలి.
ఈ రోజుల్లో గ్యాస్, అజీర్తి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. సరైన జీవనశైలి, ఎక్సర్సైజ్ ఉంటే కడుపు సంబంధిత సమస్యలు రావు. మనం ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలి. ఇవి కూడా పొట్టను శుభ్రం చేస్తాయి. కొన్ని రోజుల్లోనే గ్యాస్, మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఈరోజు అలాంటి 3 పండ్లను తెలుసుకుందాం. దీంతో పొట్ట కేవలం పదిరోజుల్లో శుభ్రమైపోతుంది.
కొన్ని నివేదికల ప్రకారం ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చుకుంటే పొట్ట సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టిరియాను పెంచుతాయి. ఇవి జ్యూసుల రూపంలో వారం తీసుకుంటే బరువు కూడా తగ్గిపోతారు.
నిమ్మకాయ జ్యూస్.. నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు నిమ్మకాయతో చేసిన జ్యూస్ తీసుకుంటే పొట్ట శుభ్రం అవుతుంది. పొట్టలో హానికరమైన బ్యాక్టిరియా పెరగకుండా కాపాడుతుంది.
యాపిల్ జ్యూస్.. వారం రోజులపాటు యాపిల్ జ్యూస్ తాగితే కూడా పొట్టపై మంచి ప్రభావం ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. యాపిల్ జ్యూస్ తో పొట్ట కొన్ని రోజుల్లోనే శుభ్రమవుతుంది.
కూరగాయలు.. క్యారట్, బీట్రూట్ వంటి కూరగాయలతో తయారు చేసిన జ్యూసులు కూడా పొట్టకు మంచివి. ఉదయం ఖాళీ కడుపున ఈ జ్యూసులు కనీసం ఓ వారం పాటు తీసుకుంటే మీ పొట్ట శుభ్రమవుతుంది. ముఖ్యంగా ఫైబర్ ఉన్న కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇవి కూడా కొన్ని రోజుల్లోనే పొట్టను శుభ్రం చేస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )