Airplane Travel Tips: ఈ వస్తువులను పొరపాటున విమానాల్లో తీసుకెళ్లకూడదు... ఎందుకో తెలుసా?

Must Not Allowed In Airplane: లైఫ్‌లో ఒక్కసారైనా విమానం ఎక్కాలి, అందులో ప్రయాణించాలని చాలామందికి ఉంటుంది. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ విమానం ప్రయాణం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు ఈ మార్గం ఎంచుకుంటారు. సుదూర ప్రాంతాలను అతి చేరువలోకి తీసుకువస్తుంది. అతి తక్కువ సమయంలోనే దూర ప్రాంతాలకు వెళ్లవచ్చు.

Must Not Allowed In Airplane: ఎప్పుడైనా విమాన ప్రయాణం చేసినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని రకాల వస్తువులు విమానం ప్రయాణంలో తీసుకువెళ్లకూడదు. దీనివల్ల మీకు ఆలస్యం అవ్వవచ్చు. అంతేకాదు విమాన  ప్రయాణం సమయంలో  మీకు ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు.

1 /6

ఎయిర్‌ పోర్ట్‌లోనే విస్త్రత తనిఖీలు చేసే ఆనవాయితీ ఎయిర్‌ పోర్టులో ఉంటుంది. అయితే, కొన్ని నిబంధనాల ప్రకారం విమానంలో మీరు ఎప్పుడైనా ప్రయాణించేటప్పుడు కొన్ని రకాల వస్తువులను మాత్రం మీతోపాటు ఎప్పుడూ తీసుకు వెళ్లకూడదు. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.  

2 /6

కొన్ని రకాల వస్తువులు తీసుకువెళ్లడం వల్ల ప్రయాణీకులకు కూడా ఇబ్బంది. చెకింగ్‌ వంటివి చేసేటప్పుడు ప్రయాణం కూడా ఆలస్యం కావచ్చు. అందుకే మీరు కూడా విమాన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల వస్తువులు మీతోపాటు తీసుకువెళ్లకూడదు.   

3 /6

ఎండు కొబ్బరి మీ బ్యాగేజీలో తీసుకుని వెళ్లకూడదు ఎందుకంటే ఇందులో ఆయిల్‌ ఉంటుంది. మండే స్వభావం కూడా కలిగి ఉంటుంది.  

4 /6

లైటర్లు, ఇ సిగరెట్లు, గ్యాస్‌ క్యాట్రిడ్జ్‌ వంటివి కూడా విమాన ప్రయాణంలో తమతోపాటు తీసుకువెళ్లకూడదు  

5 /6

థర్మోమీటర్‌ వంటివి కూడా తమతోపాటు తీసుకువెళ్లకూడదు. ఇందులో ఉండే పాదారసం వల్ల కూడా విమాన ప్రయాణానికి ప్రమాదం.  

6 /6

బ్యాటరీ పవర్‌ వీల్‌ అడాప్టర్లు వంటివి తీసుకు వెళ్లకూడదు. ఇందులో యాసిడ్‌ ఉంటుంది. అంతేకాదు లిథియం మెటల్‌, లిథియం అయాన్‌ సెల్, పవర్‌ బ్యాంకులు, బ్యాటరీలు వంటివి కూడా తమతోపాటు తీసుకువెళ్లకూడదు.