కరోనా వినాయకుడి చిత్రాలను చూస్తే ఎవరైనా వెంటనే షేర్ చేయాల్సిందే అనుకుంటారు.ఈ విగ్రహాలను తయారు చేసిన కళాకారుడికి సలాం చేయాలి అనుకుంటారు. వీటిని స్పెషల్ గా డిజైన్ చేశారు. కోవిడ్-19 వైరస్ ను వినాయకుడు అంతం చేస్తే ఎలా ఉంటుందో ఇలా వెల్లడించారు
తమిళనాడులో శ్రీగణేషుడు కరోనావారియర్ అవతారం ఎత్తాడు. రాజా అనే కళాకారుడు వినాయకుడు, కరోనావైరస్ మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో ఇలా డిజైన్ చేసి చూపించాడు.
కరోనాతో పోరాడాలి అంటే రోగనిరోధక శక్తి ఉండాలి. రాయ్ పూర్ కళాకారుడు ఇలా భక్తులకు ఇమ్యూనిటీని ప్రసాదించే వినాయకుడిని తయారు చేశాడు.
కరోనాను వినాయకుడు అంతం చేస్తే ఎలా ఉంటుందో
కర్ణాటకలోని ఒక కళాకారుడు ఈ వినాయక విగ్రహాన్ని తయారు చేశాడు. శ్రీధర్ అనే ఈ కళాకారుడు ఎన్ని అవరోధాలు ఎదురైనా చికిత్స కొనసాగించే వైద్యుడిగా వినాయకుడిని చూపించారు
కరోనా కాలంలో జీవితం చాలా మారిపోయింది. ప్రతీ సంవత్సరం వినాయకుడి మంటపాల్లో వేడకగా పండగ జరిగేది. కానీ ఈ సారి వైరస్ సంక్రమణను గమనించి మంటపాలు ఏర్పాట్లు చేయడం లేదు. ఇంట్లోనే చాలా మంది వినాయకుడిని ఆరాధిస్తున్నారు. ఇదంతా కరోనా వల్లే..