Tollywood Highest Pre Release Business Movies: తెలంగాణ, ఏపీల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు పార్ట్ -2..

Tollywood Highest Pre Release Business Movies: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఆదిపురుష్ తో పాటు పుష్ప సహా పలు సినిమాలు కూడా ఉన్నాయి.

 

1 /6

ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ మూవీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

2 /6

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 107.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

3 /6

  చిరంజీవి తొలిసారి చారిత్రక యోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 106.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4 /6

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సినిమా ‘రాధే శ్యామ్’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో 105.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /6

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 102 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /6

  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప పార్ట్ -1’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 101.75 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.