Teacher Days 2024: మన సంస్కృతిలో తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన పెద్దలు మాతృదేవోభవా..! పితృ దేవోభవా..! ఆచార్య దేవోభవా..! అని గురువును ఎంతో ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది. మన హీరోలు కూడా అపుడపుడు గురువు పాత్రల్లో నటించి మెప్పించారు.
సార్.. ప్రస్తుతం సమాజంలో విద్య అనేది కార్పోరేట్ లెవల్ కి మారింది. ఈ నేపథ్యంలో విద్యను కార్పరేటికరణకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ సినిమా ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలిపేలా తెరకెక్కించారు.
మాస్టర్.. చిరంజీవి హీరోగా సురేశ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమాలో ఉపాధ్యాయుడి పాత్రలో మెగాస్టార్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
సింహా.. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిన ‘సింహా’ చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటించారు. అంతకు ముందు ‘వంశోద్దారకుడు’ సినిమాలో పీటీ టీచర్ పాత్రలో నటించి మెప్పించారు.
సుందరకాండ.. కే.రాఘవేంద్రావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రంలో టీచర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.
ఓనమాలు.. రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలో యాక్ట్ చేసిన చిత్రం ‘ఓనమాలు’. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఉపాధ్యాయులు గొప్పతనాన్ని చాటింది.
బడిపంతులు.. ఎన్టీఆర్ హీరోగా టైటిల్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘బడి పంతులు’. ఆ తర్వాత విశ్వరూపం సినిమాలో కూడా ఉపాధ్యాయుడిగా తన నట విశ్వరూపం ప్రదర్శించారు.
మిరపకాయ్.. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిరపకాయ్’. ఈ సినిమాలో రవితేజ.. లెక్చరర్ పాత్రలో నటించి మెప్పించాడు.
గోల్కొండ హై స్కూల్.. సుమంత్ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గోల్కొండ హై స్కూల్’. ఈ సినిమా మంచి ఉపాధ్యాయ చిత్రంగా నిలిచిపోయింది.
వీళ్లతో పాటు పలువరు హీరోలు వీలైనపుడల్లా.. ఉపాధ్యాయుల వేషాలతో అలరించారు. అందులో ఎక్కువ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.