T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 రేపు జూన్ 2 నుంచి వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనుంది. ఈ నేపధ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అందరికంటే ఎక్కవగా సిక్సర్లు కొట్టిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

T20 Highest Sixes: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 రేపు జూన్ 2 నుంచి వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనుంది. ఈ నేపధ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అందరికంటే ఎక్కవగా సిక్సర్లు కొట్టిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

1 /6

అత్యధిక సిక్సర్లు టీ20 ప్రపంచకప్‌లో ఏ క్రికెటర్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు ఉందో పరిశీలిద్దాం. టాప్ 5  ఆటగాళ్లలో దిగ్గజ బ్యాటర్లు ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్న ఆటగాడికి రెండో స్థానంలో ఆటగాడికి మధ్య చాలా అంతరం ఉంది.

2 /6

యువరాజ్ సింగ్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో సిక్సర్లకు మారుపేరుగా మాజీ టీమ్ ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరు చెప్పాలి. ఈ జాబితాలో యువరాజ్ పేరు నాలుగో స్థానంలో ఉంది. ఇతను 33 సిక్సర్లు కొట్టాడు. 

3 /6

షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సంధించిన ఆటగాళ్లు జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 31 సిక్సర్లు కొట్టాడు.

4 /6

రోహిత్ శర్మ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న మరో పేరే హిట్ మ్యాన్. సిక్సర్లు కొట్టడంతో ఇతడి తరవాతే ఎవరైనా. టీ20 ప్రపంచకప్‌లో అత్యదికంగా 35 సిక్సర్లతో  రెండవ స్థానంలో ఉన్నాడు.

5 /6

జోస్ బట్లర్ ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ టీ20లో సిక్సర్ల వీరుడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యదిక సిక్సర్లు సాధించినవారిలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇతడు కూడా 33 సిక్సర్లు కొట్టాడు.

6 /6

క్రిస్‌గేల్ టీ 20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్ల అవార్డు ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్న క్రిస్‌గేల్ పేరిట ఉంది. భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. మొత్తం 63 సిక్సర్లు కొట్టాడు.