Surya Shani yuti: సూర్య శని గ్రహాల యుతితో ఈ 6 రాశులకు రానున్న 30 రోజులు అంతా ఐశ్వర్యమే

మార్చ్ 6వ తేదీ అంటే మరో నెల రోజుల తరువాత శని ఉదయించనున్నాడు. శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి 13న సూర్యుడు మకరరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా యుతి ఏర్పడనుంది. ఈ కాలంలో శని శక్తిలోపిస్తుంది. అటు సూర్యుడి శక్తి పెరుగుతుంది. రానున్న 30 రోజులు అన్ని రాశులకు అత్యంత కీలకం కానుంది. కానీ కొన్ని రాశులకు ఊహించని లాభం కలుగుతుంది. 
  • Feb 07, 2023, 06:23 AM IST

Surya Shani yuti: మార్చ్ 6వ తేదీ అంటే మరో నెల రోజుల తరువాత శని ఉదయించనున్నాడు. శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి 13న సూర్యుడు మకరరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా యుతి ఏర్పడనుంది. ఈ కాలంలో శని శక్తిలోపిస్తుంది. అటు సూర్యుడి శక్తి పెరుగుతుంది. రానున్న 30 రోజులు అన్ని రాశులకు అత్యంత కీలకం కానుంది. కానీ కొన్ని రాశులకు ఊహించని లాభం కలుగుతుంది. 

1 /6

Taurus వృషభరాశి వృషభరాశి వారికి బంధువులు, స్నేహితులతో బంధాలు మెరుగుపడతాయి. ప్రేమ జీవితం బాగుుంటుంది. దాంతోపాటు భాగస్వామితో బంధాలు పటిష్టమౌతాయి. ఆర్ధిక సమస్యలు దూరమౌతాయి. కమ్యూనికేషన్స్ బాగుంటాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది

2 /6

Scorpio వృశ్చికరాశి ప్రస్తుతం వృశ్చికరాశి వారు దోష ప్రభావంలో ఉన్నారు. ఫలితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న నెలరోజుల్లో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందుతారు. చిన్నదైనా, పెద్ద వ్యాపారమైనా లాభాలుంటాయి. తండ్రి, మావయ్య నుంచి తోడ్పాటు లభిస్తుంది.

3 /6

Libra తులా రాశి ఈ కాలంలో మీ ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. ఈ సందర్భంగా పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో లాభాలుంటాయి. ఒకవేళ కోర్టు సంబంధిత కేసులుంటే..మీకు అనుకూలంగా తీర్పు ఉంటుంది. దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలు పరిష్కారమౌతాయి. పెట్టుబడులకు మంచి సమయం.

4 /6

Gemini మిధునరాశి మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, దుఖాలు, ఇబ్బందులన్నీ రానున్న 30 రోజుల్లో తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. శుభవార్త వింటారు. ప్రత్యర్ధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఎక్కడికైనా యాత్రకు వెళ్లవచ్చు. ఒకవేళ పనిచేసే చోట ఏదైనా అసౌకర్యం ఉంటే అది కూడా తొలగిపోతుంది. 

5 /6

Aries మేషరాశి మేషరాశి వారికి రానున్న 30 రోజులు ఆరోగ్య దృష్ట్యా చాలా కీలకం. ఈ జాతకం వారికి బ్లడ్ ప్రెషర్, కీళ్లు, నరాల సంబంధిత వ్యాధుల్నించి ఉపశమనం కలుగుతుంది. కడుపు సంబంధిత సమస్యలుండవు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పనులు నిలిచిపోయినా..పాస్‌పోర్ట్- వీసా ఇబ్బందులెదురైనా..ఇక తొలగిపోతాయి.

6 /6

Aquarius కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించిన ప్రభుత్వ పనులు ఏమైనా నిలిచిపోయుంటే..అవి పూర్తవుతాయి. బిల్డర్ జిమ్, స్టీల్ లేదా ఇనుము వ్యాపారం చేసేవారికి రానున్న 30 రోజుల్లో లాభాలుంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. రెండు విషయాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మొదటిది ప్రతి శనివారం నాడు శనీశ్వరాలయానికి వెళ్లాలి. రెండవది నల్ల బట్టలు ధరించకూడదు.