Sun Transit: గ్రహాలకు రాజు మే 14వ తేదీన సంచారం.. ఈ రాశుల వారికి ఆర్థికపరంగా ఇక డోకా లేదు!


Sun Transits Into Taurus: మే 14వ తేదీన గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

 

Sun Transits Into Taurus: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలకు సూర్యగ్రహాన్ని రాజుగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం సంచారం చేయడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై శుభ అశుభ ప్రభావాలు పడుతూ ఉంటాయి. 
 

1 /7

 మే 14వ తేదీన సూర్య గ్రహం శుక్రుడు అధిపతిగా వ్యవహరించే వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ సమయం కొన్ని రాశుల వారికి శుభప్రదంగాను మరికొన్ని రాశుల వారికి అశుభ్రంగాను ఉండబోతోంది. అయితే మే 14 నుంచి ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.  

2 /7

మే 14వ తేదీన వృషభ రాశిలోకి సూర్యుడు సంచారం చేయడం కారణంగా సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా ప్రశంసలు పొందుతారు. అలాగే ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి.

3 /7

సింహ రాశి వారికి ఈ సూర్యగ్రహ సంచారం కారణంగా మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అలాగే కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.  

4 /7

శుక్రుడి సంచార ప్రభావం మేష రాశి వారిపై కూడా పడబోతోంది. దీంతో మే 14వ తేదీ నుంచి వీరికి శుభ ఘడియలు ప్రారంభం అవుతాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అదృష్టంతో లాభాలు పొందగలుగుతారు.

5 /7

ఈ సంచారంతో వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది దీని కారణంగా ఎలాంటి పనులైన ఎంతో తొందరగా కంప్లీట్ చేస్తారు. అలాగే కోర్టు కేసుల్లో కూడా వీరు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సపోర్టు లభించి వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెడతారు.  

6 /7

సూర్యుడి సంచారంతో కుంభ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే వ్యాపారాల్లో ఎదుగుదల కనిపిస్తుంది.  

7 /7

కుంభ రాశి వారికి సూర్యుడి సంచారంతో అనేక శుభవార్తలు వింటారు. ముఖ్యంగా వీరు ఆర్థిక లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే వ్యాపారంలో వస్తున్న సమస్యల నుంచి వీరికి ఉపశమనం లభిస్తుంది ఇబ్బందులను కూడా సులభంగా అధిగమిస్తారు.