Healthy Summer Diet Tips: సమ్మర్ హీట్ కు చెక్ పెట్టాలనుకుంటున్నారా..?.. ఈ ఐదు ఫ్రూట్స్‌ లను అస్సలు మరువద్దు..

Summer heat Wave: కొన్నిరోజులుగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. బైటకు వెళ్లాలంటేనే హైరానా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనాలు భానుడి దెబ్బకు పిట్టల్లా రాలుతున్నారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రిలను దాటేశాయి.దీంతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది.

1 /8

కొన్నిరకాల ఫ్రూట్స్ లను మన డైట్ లో యాడ్ చేస్తే ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాలానుగుణంగా వచ్చే పండ్లు మార్కెట్ లో కన్పిస్తుంటాయి. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా, చల్లగా ఉంచేలా చేస్తు, విటమిన్లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు.   

2 /8

పుచ్చకాయలు: వేసవిలో తినడానికి ఉత్తమమైన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుండి శరీరాన్ని రక్షిస్తుంది.  

3 /8

నారింజలు: విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో పాటు, నారింజలో పొటాషియం,  పోషకాలు కూడా ఉంటాయి. ఇవి కండరాల నొప్పి,  తిమ్మిరి చికిత్సకు సహాయపడతాయి. నారింజ బలమైన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి,  వ్యాధులతో పోరాడటానికి శరీరాన్ని అనుమతిస్తుంది.

4 /8

కివీస్: ఆరెంజ్‌ల మాదిరిగానే, కివీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం చల్లగా ఉండలే చేస్తాయి. విటమిన్లు, పొటాషియం,  ఫైబర్ కలిగి ఉంటాయి.  

5 /8

6 /8

కివీస్: ఆరెంజ్‌ల మాదిరిగానే, కివీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం చల్లగా ఉండలే చేస్తాయి. విటమిన్లు, పొటాషియం,  ఫైబర్ కలిగి ఉంటాయి.  

7 /8

పీచెస్: పీచెస్ వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి చర్మానికి మేలు చేసే జ్యుసి ఫ్రూట్స్. అవి విటమిన్లు A, C  కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు,  ఫైబర్ లను కలిగిఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  

8 /8

తాటి ముంజలు: తాడ్గోలా లేదా తాటి పండు అధిక నీటి శాతం కలిగిన మరొక పండు. దాని శీతలీకరణ లక్షణాల కారణంగా, ఇది వేసవికి ఉత్తమమైనది; అధిక నీటి కంటెంట్ శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)