SBI Scheme : SBIలోని ఈ స్కీములో డబ్బులు పెడితే చాలు.. మీకు 444 రోజుల్లో రూ.10 లక్షలు పక్కా..ఎలాగంటే?

స్టాక్ మార్కెట్లు ఎంతో రిస్కుతో కూడుకున్నవి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా మీ పెట్టుబడులకు పూర్తి హామీని ఇవ్వవు. దీంతో పాటు రియల్ ఎస్టేట్, బంగారం మార్కెట్లు కూడా మీ పెట్టుబడులకు ఎప్పటికీ పూర్తిస్థాయిలో హామీని ఇవ్వవు. మరి అలాంటప్పుడు మీరు పెట్టే డబ్బుకు పూర్తి గ్యారెంటీ హామీ ఇస్తున్న ఏకైక పథకం బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ప్రస్తుతం మనం 400 రోజులపాటు బ్యాంకులో ఎఫ్డి డిపాజిట్ చేసినట్లయితే ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


 

1 /8

SBI Amrit Vrishti Scheme : సాధారణంగా బ్యాంకులో అందించే ఎఫ్డి డిపాజిట్లు 100శాతం గ్యారెంటీతో మీకు వడ్డీ  ఆదాయాన్ని అందిస్తాయి. ఎందుకంటే బ్యాంకులో స్థిరమైన వడ్డీ రేటు తో మీకు డబ్బులు చెల్లిస్తాయి. అయితే ఎఫ్డి డిపాజిట్ లకు ముఖ్యంగా మీరు తప్పనిసరిగా బ్యాంకులో నిర్ణీత కాలవ్యవధి వరకు నిర్ణీత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వడ్డీ చెల్లింపు అనేది  నెలకు ఒకసారి, లేదా మూడు నెలలకు ఒకసారి  చొప్పున చెల్లిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం 400 రోజులపాటు బ్యాంకులో ఎఫ్డి డిపాజిట్ చేసినట్లయితే ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.   

2 /8

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ( SBI) అమృత్ వృష్టి అనే కొత్త ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పరిమిత కాలానికి మాత్రమే, పెట్టుబడి మొత్తంపై అధిక వడ్డీ రేట్ల రాబడిని అందిస్తుంది. అనేక ఇతర బ్యాంకులు SBI అమృత్ వృష్టి FD స్కీమ్ మాదిరిగానే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అమలు చేస్తున్నాయి. 400 రోజుల కన్నా ఎక్కువ రోజులు  FD స్కీమ్‌పై ఏ బ్యాంక్ ఎంత వడ్డీని  ఆఫర్ చేస్తుందో తెలుసుకుందాం.  

3 /8

SBI అమృత్ వృష్టి: SBI ఇటీవల SBI అమృత్ వృష్టిని ప్రారంభించింది. ఇది 444 రోజుల వ్యవధిలో పెట్టుబడి మొత్తంపై సాధారణ పౌరులకు 7.25 శాతం ,  సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం అధిక వడ్డీ రేట్ల రాబడిని అందిస్తోంది. ఈ పథకం 15 జూలై 2024 నుండి 31 మార్చి 2025 వరకు పెట్టుబడికి అందుబాటులో ఉంది. ఈ స్కీములో మీరు 3 కోట్ల రూపాయల వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు రూ. 1 కోటి రూపాయలను డిపాజిట్ చేస్తే దీనిపై మీకు 444 రోజులకు గానూ సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.75 శాతం కింద రూ. 10 లక్షల వరకూ ఆదాయం లభిస్తుంది.    

4 /8

పంజాబ్ నేషనల్ బ్యాంక్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 400 రోజుల కాలానికి సాధారణ పౌరులకు 7.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.  

5 /8

కెనరా బ్యాంక్: కెనరా బ్యాంక్ సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని 444 రోజుల కాలానికి అందిస్తోంది.  

6 /8

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 399 రోజుల FDపై సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.  

7 /8

బ్యాంక్ ఆఫ్ బరోడా: బ్యాంక్ ఆఫ్ బరోడా 399 రోజుల FD (BOB మాన్‌సూన్ ధమాకా యోజన)పై సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీని అందిస్తోంది.  

8 /8

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సాధారణ పౌరులకు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.