Star Fruit benefits: స్టార్ ఫ్రూట్ నేది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ పండు చూడడానికి నక్షత్రం ఆకారంలో ఉంటుంది. స్టార్ ఫ్రూట్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. జలుబు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
స్టార్ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది మలబద్ధకం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
స్టార్ ఫ్రూట్లో పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం రక్త పోటు నియంత్రించడానికి సహాయపడుతుంది. గుండె సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
స్టార్ ఫ్రూట్లో కేలరీలు తక్కువగా ఉండి నీరు చాలా ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గించాలనుకునే వారికి ఇది మంచి ఆహార ఎంపిక.
స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి, బి2, బి6, బి9, ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్, కాల్షియం, సోడియం, ఫోలేట్, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.