Pooja Hegde: ఆటోలో బుట్టబొమ్మ హల్‌చల్.. పూజా హెగ్డే క్విక్ రైడ్‌ పిక్స్ వైరల్

Pooja Hegde In Auto: బుట్టబొమ్మ పూజా హెగ్డే శ్రీలంక వెకేషన్‌కు వెళ్లింది. షూటింగ్‌లకు కాస్త గ్యాప్ దొరకడంతో ఈ ముద్దుగుమ్మ శ్రీలంక విధుల్లో చక్కర్లు కొడుతోంది. ఈ టూర్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది.  
 

1 /5

సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు జంటగా ఎస్‌ఎస్‌ఎంబీ 28 మూవీలో నటిస్తోంది పూజా. ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడడంతో మహేష్ బాబు ఫారెన్ ట్రిప్‌కు వెళ్లగా.. పూజా హెగ్డే శ్రీలంక ట్రిప్‌కు వచ్చింది.  

2 /5

శ్రీలంకలో సాధారణ ప్రయాణికురాలిగా ఆటో ఎక్కి ప్రయాణించేసింది బుట్టబొమ్మ. ఆటోలో క్విక్ రైడ్ అంటూ పిక్స్‌ను షేర్ చేసింది.   

3 /5

ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్నాయి. బుట్టబొమ్మ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నా.. ఆటోలో ప్రయాణించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   

4 /5

అందులోనూ కార్మిక దినోత్సవం రోజు ఈ బ్యూటీ ఆటోలో ప్రయాణించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పూజాను అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.   

5 /5

ఇక కెరీర్ విషయానికి వస్తే.. పూజా చేతిలో తెలుగులో త్రివిక్రమ్ సినిమా మాత్రమే ఉంది. తమిళ, బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ భామ.