SSC CHSL Tier I Result 2024: SSC CHSL టైర్‌ I ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోవచ్చు..

SSC CHSL Tier I Result 2024 Link: స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్‌ SSC CHSL టైర్‌ I ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెంటనే ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాంబైన్ట్‌ హయ్యర్‌ సెకండరీ (10+2) లెవల్‌ ఎగ్జామినేషన్‌ ఫలితాలను ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
 

1 /5

2024 జూలై 1వ తేదీ టైర్‌ I పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. అధికారికంగా కేటగిరీ ప్రకారం కటాఫ్‌ మార్కులు తీసి వేసిన తర్వాత అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేశారు. ఈ ఫలితాలతోపాటు టైర్‌ II పరీక్ష వివరాలను విడుదల చేశారు.   

2 /5

మొత్తం 39835 అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (LDC)/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (DEO) కానీ, ఈ అభ్యర్థులు టైర్‌ II ఎగ్జామ్‌ కూడా పాసవ్వాల్సి ఉంటుంది.  

3 /5

SSC CHSL Tier I Result 2024 ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి.. ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.in ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత హోంపేజీలోని లింక్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. ఒక కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. SSC CHSL Tier I Result 2024 list 1,2 పై క్లిక్‌ చేయాలి.

4 /5

ఆ తర్వాత కొత్త పీడీఎఫ్ ఓపెన్‌ చేసి వారి రోల్‌నంబర్‌, ఇతర వివరాలతో చెక్‌ చేసుకోవచ్చు. ఓ హార్డ్‌కాపీని భవిష్యత్తు అవసరాల నిమిత్తం డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ పరీక్షకు సంబంధించిన మార్కుల, జవాబు కీని త్వరలన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో అర్హత సాధించిన, సాధించలేనివారి వివరాలు ఉంటాయి.

5 /5

టైర్‌ II పరీక్ష వివరాలు కూడా త్వరలోనే అందుబాటులో ఉంచారు. SSC CHSL Tier 1 పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (Computer Based Test) విధానంలో నిర్వహిస్తారు. 3,712 ఖాళీలను వివిధ డిపార్టుమెంట్లలో భర్తీ చేయనున్నారు.  మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో సందర్శించాలి.