Bhadrachalam: జానకిని పెళ్లాడిన రామయ్య..  భద్రాచలంలో కల్యాణ వైభోగం

Sri Rama Navami 2024: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారామచంద్రుల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణాలు, మేళతాళాల శబ్ధాల మధ్య సీతను రామయ్య వరించాడు. కల్యాణ కాంతులతో సీతారాములు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో భద్రాద్రి భక్తాద్రిగా మారింది. మిథిలా స్టేడియం భక్తజనంతో కిటకిటలాడగా.. రామనామస్మరణతో భద్రాచలం మార్మోగింది.

1 /10

Bhadrachalam Kalyanam: మిథిలా స్టేడియంలో భక్తజనులకు దర్శనమిస్తున్న స్వామి అమ్మవార్లు

2 /10

Bhadrachalam Kalyanam: కల్యాణకాంతులతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న సీతారాములు

3 /10

Bhadrachalam Kalyanam: సీతారాములకు ఆభరణాలు ధరింపజేస్తున్న వేద పండితులు

4 /10

Bhadrachalam Kalyanam: స్వామి అమ్మవార్లపై ముత్యాల తలంబ్రాలు వేస్తున్న అర్చకులు

5 /10

Bhadrachalam Kalyanam: అభిజిత్‌ లగ్నములో సీత మెడలో మాంగల్యాధరణ జరిగింది.

6 /10

Bhadrachalam Kalyanam: సీతారాముల కల్యాణం జరిపిస్తున్న వేద పండితులు  

7 /10

Bhadrachalam Kalyanam: శ్రీరామనవమి వేడుకల్లో ప్రధాన ఘట్టం కల్యాణం తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు

8 /10

Bhadrachalam Kalyanam: కల్యాణ వేదికకు చేరుకుంటున్న భద్రాచలం సీతారాములు

9 /10

Sri Rama Navami KTR: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని పురాతన ఆలయంలో కల్యాణ వేడుకకు హాజరైన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌.

10 /10

Sri Rama Navami KTR: కూకట్‌పల్లిలోని ఆలయంలో కేటీఆర్‌కు ఆశీర్వచనం అందజేస్తున్న అర్చకులు. చిత్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.