Sreeleela Hot Photos: శ్రీలీల గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు సినిమాలతోనే కాకుండా. ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా అభిమానులను ప్రేమలో పడేస్తూఉంటుంది ఈ హీరోయిన్.
మొదటి సినిమా పెళ్లిసందడి ద్వారానే.. తెలుగు ప్రేక్షకుల అందరి దృష్టిని తన వైపు తిప్పుకునింది శ్రీలీల.. ఆ తర్వాత వచ్చిన ధమాకా చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ధమాకా చిత్రంలో శ్రీలీల డాన్స్ కి.. ఆమె అందానికి.. తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ చిత్రం తర్వాత తెలుగు దర్శకులకు, నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.. ఈ సెన్సేషనల్ బ్యూటీ.
ఈ క్రమంలో వరసగా తొమ్మిది తెలుగు చిత్రాల ఆఫర్లు అందుకొని.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ తొమ్మిది సినిమాలలో.. కేవలం ఒకటి, రెండు చిత్రాలు మాత్రమే విజయం సాధించడం ఆమె అభిమానులను కొంచెం నిరాశపరిచాయి.
కానీ శ్రీలీల బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి మాత్రం.. ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఈ మధ్యనే మహేష్ బాబు.. గుంటూరు కారం సినిమాలో కూడా కనిపించి మెప్పించింది.
కాగా ఈ హీరోయిన్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీకి.. త్వరలోనే.. అజిత్ గుడ్ బాడ్ అగ్లీ.. సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలీల షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి