Sreeleela: చీరలో శ్రీలీల…యువతను తన కొంగుకు చుట్టేస్తూ!

Sreeleela Instagram Photos: శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే. సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ఫోటోలతో వైరల్ గా మారింది.

1 /5

కన్నడ సినిమా కిస్ తో హీరోయిన్ గా పరిచయమైంది నటి శ్రీలీల. అక్కడ మొదటి సినిమాతోనే విజయం సాధించిన ఈ హీరోయిన్ ఇక్కడ తెలుగులో రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తన మొదటి చిత్రం చేసింది.

2 /5

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా.. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల. ఆ తరువాత రవితేజ చిత్రం ధమాకా తో సెన్సేషనల్ గా మారింది.

3 /5

సీనియర్ హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా అందరి సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా శ్రీలీల తెలుగమ్మాయి కావడం ఆమెకు మరింత ప్లస్ అయ్యింది. 

4 /5

తెలుగు సినిమాల్లో సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీ లీల త్వరలోనే తమిళ సినిమాలకు సైతం అడుగుపెట్టనుంది. అజిత్ సినిమా గుడ్ బాడ్ అగ్లీ లో శ్రీలీల కి హీరోయిన్ పాత్ర వచ్చింది అని వార్తలు వస్తున్నాయి.

5 /5

సినిమాల విషయం పక్కన పెడితే..ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అందరినీ ఆకట్టుకుంటుంది శ్రీలీల. ముఖ్యంగా చీరలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ప్రేమలో పడేస్తున్నాయి.