Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

Best snake repellent plants: కొన్ని చెట్లంటే పాములు ఎంతో భయపడిపోతుంటాయి. ఇవి ఉన్న ప్రదేశాల్లోకి రావని చెబుతుంటారు. ఈ మొక్కలను ఇంటి చుట్టుపక్కల లేదా గార్డెన్ లలో పెట్టాలని కూడా నిపుణులు చెబుతుంటారు. 

1 /5

మనలో ప్రతి ఒక్కరు పాములంటే భయంతో వణికిపోతుంటారు.. అడవులు, దట్టమైన చెట్లు, నీళ్ల జాడలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తాయి. ఎలుకల కోసం పాములు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. పొలాల్లో కూడా పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. 

2 /5

పాములు కన్పించగానే భయంతో స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రం.. పాములను దేవతాలా కొలుస్తారు. ఇక పాములు కొన్ని సందర్భాలలో మనుషులను కాటు వేస్తుంటాయి. మెయిన్ గా వర్షాకాలంలో పాముల కాట్ల ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి.

3 /5

కొందరు పాములు తమ ఇంట్లోప్రవేశించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే.. కొన్నిచెట్లను మన ఇంటి పరిసరాల్లో నాటితే పాములు ఆ ఇంట్లో చుట్టుపక్కల అస్సలు కన్పించవంట.. ఈ చెట్ల నుంచి ఒక రకమైన వాసన వస్తుందంట. ఈ స్మెల్ ను పాముల్ని వెంటనే గ్రహిస్తాయంట.

4 /5

బంతిపూలు చెట్లను ఇంట్లో పెట్టుకొవాలంట. అదే విధంగా.. సిట్రస్ జాతీకి చెందిన పండ్లు, లెమన్ గ్రాస్ మొక్కలను ఇంట్లో పెట్టుకొవాలంట.  నిమ్మగడ్డి జాతీకి చెందిన మొక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, సర్పగంథం అనే మొక్కలను పాములు అస్సలు ఇష్టపడవంట. 

5 /5

అదే విధంగా.. క్లోవ్ బాసిల్ లవంగం మొక్కలు వంటి వాటిని ఇంట్లో పెంచుకుంటే పాములు అస్సలు ఉండవంట.ఈ మొక్కలు ఉన్న చోట్ల పాములు సంచారం చేయవంట అని నిపుణులు చెబుతుంటారు.  వీటితోపాటు సోలనేసీ కుటుంబానికి చెందిన ధాతురా స్ట్రామోనియం, చైనీస్ ఉల్లిపాయలు వంటి మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే పాములు ఆ ఇంటివైపు కన్నేత్తి కూడా చూడవంట. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)