Solar Eclipse 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఈ సంవత్సరం రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ నెలలో ఏర్పడబోతోంది. ఈ గ్రహణానికి అన్ని గ్రహహణాల కంటే ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ గ్రహణం అక్టోబర్ నెలలోని అశ్వినీ మాస అమావాస్య తిథిలో ఏర్పడుతుంది. అలాగే ఈ రోజు సర్వపితా అమావాస్య కూడా వచ్చింది. అయితే కన్యా రాశిలో సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది.
ఈ ఏడాదిలోని సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడబోతోంది. ఇది పిత్రక్ష చివరి రోజు కాబట్టి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయి.
ఈ అక్టోబర్ 2న ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా మిథన రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.
మిథున రాశివారు ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. దీంతో పాటు పిల్లలపై కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
కర్కాటక రాశివారికి ఈ సూర్య గ్రహణం కారణంగా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారు. దీంతో పాటు లాభాలు కూడా రెట్టింపు అవుతాయి.
అలాగే ఈ రాశివారి సమజంలో గౌరవం పెరిగి మంచి పేరును పొందుతారు. దీంతో పాటు ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
ఈ రాశివారికి కూడా సూర్యగ్రహణం చాలా బాగుంటుంది. దీంతో పాటు భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా పెరుగుతుంది. వీరు స్నేహితులతో సరదాగా ఉంటారు.