Solar Eclipse 2024: సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళ ప్రక్రియలో భాగమే అయినా హిందూ జ్యోతిష్యశాస్త్రంలో విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంది. ఈ ఏడాదిలో చివరి, రెండవ సూర్య గ్రహణం త్వరలో ఏర్పడనుంది. ఇండియాలో ఈ సూర్య గ్రహణం కన్పించకపోయినా 5 రాశుల జీవితాలపై పెను ప్రభావం పడనుంది. అందుకే ఈ 5 రాశుల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
ఇండియాలో సూర్య గ్రహణం తేదీ సమయం ఎప్పుుడు 2024 చివరి రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ 2న ఉంది. ఇండియాలో ఈ సూర్య గ్రహణం టైమింగ్ అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9.13 గంటల నుంచి తెల్లవారుజామున 3.17 గంటల వరకూ ఉంటుంది. దాదాపు 6 గంటలుంటుంది. ఈ సూర్య గ్రహణం ప్రభావం 5 రాశులపై ఉంటుంది.
మేష రాశి సూర్య గ్రహణం ప్రభావంతో అక్టోబర్ 2 నుంచి మేష రాశి జాతకులకు కష్టాలు ప్రారంభం కానున్నాయి. జీవితంలో అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురుకావచ్చు. పెళ్లైనవారికి కూడా ఇబ్బందులు ఉంటాయి. పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి. ఆర్దికంగా ఇబ్బందులు ఉండవచ్చు.
మిధున రాశి మిధున రాశి జాతకులకు సూర్య గ్రహణం నెగెటివ్ ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. అందుకే ఆహారపు అలవాట్ల విషయంలో శ్రద్ధ వహించాలి. పెళ్లైనవారి జీవితంలో సమస్యలు ఎదురుకావచ్చు. ధననష్టం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి
కర్కాటక రాశి ఈ రాశి ప్రజలకు సూర్య గ్రహణం ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ధననష్టం ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు ఎదురుకావచ్చు. ఉద్యోగస్థులు అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులు పూర్తి కావు. కుటుంబంలో అశాంతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
సింహ రాశి సూర్య గ్రహణం ప్రభావం సింహ రాశి జాతకులపై అత్యంత దారుణంగా ఉండనుంది. జీవితంలో విలువైనవి కోల్పోయే పరిస్థితి ఉంది. ధననష్టం ఉంటుంది. ఆస్థులు కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం అనువైన సమయం కాదు. వ్యాపారులు, ఉద్యోగస్థులు ఇరువురూ జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి మీన రాశిపై సూర్య గ్రహణం ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. అంటే అన్నింటిలో అవరోధాలు ఎదురౌతాయి. చేపట్టిన పనులు ఆగిపోతాయి. ధననష్టం ఉటుంది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు కష్టకాలమే అని చెప్పాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.