Poori Making: పూరీలు సరిగ్గా పొంగట్లేదని బెంగపడుతున్నారా..?.. ఈ టిప్స్ పాటిస్తే హోటల్ స్టైల్‌లో బెలూన్‌లా పొంగుతాయి..

Poori making process: చాలా మంది పూరీలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. పూరీలు చేయడంలో  కొందరు ఇబ్బందులు పడుతుంటారు.  పూరీలు చేయగానే నిముషాల్లో వ్యవధిలోనే మెత్తగా మారిపోతున్నాయని,   పొంగడంలేదని బెంగ పెట్టుకుంటారు.
 

1 /6

పూరీలు చేయడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పుకొవచ్చు. అయితే.. గోధుమ పిండిని నానబెట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం పూరీలు గుల్ల మాదిరిగా పెద్దగా పొంగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 /6

మొదట గోధుమ పిండిని తెచ్చుకుని దాన్ని ఒక గిన్నెలో వేసుకొవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో పిండిని నానబెట్టాలి. పిండి కలిపేటప్పుడు చేతికి అంటుకొకుండా ఉండేలా వచ్చేవరకు కూడా చక్కగా కలపాలి..  

3 /6

గోధుమ పిండిలో కొద్దిగా మైదాపిండి కలుపుకొవాలి. లేకపోతే.. చక్కెరను గోధుమ పిండిలో కలుపుకుని పూరీలు చేస్తే.. ఆ పూరీలు హోటల్ స్టైల్ లో పొంగుతాయి.అంతే కాకుండా..సిమోలీనా, టాపియోకా పిండి ఒకటి లేదా రెండు స్పూన్ లు, చిన్న గ్లాస్ నిండా గోధుమ పిండిలో కలుపుకొవాలి.

4 /6

వీటిని గొధుమ పిండిలో కలుపుకుని ఆపిండిని ఒక అరగంట పాటు చక్కగా నానేలా చూడాలి. ఆతర్వాత పూరీలు చేస్తే మాత్రం అవి హోటల్ స్టైల్ లో పెద్దవిగా పొంగుతాయి. దీంతో పూరీలు మెత్తబడిపోతున్నయన్న సమస్య ఉండదు.  

5 /6

పూరీలను ఎక్కువగా గాలి తగిలేలా మాత్రం అస్సలు ఉంచకూడదు. పెద్దగా ఉండే బౌల్స్ లను పూరీలను ఉంచడానికి ఉపయోగించాలి. పూరీలను ఆలు కర్రీ లేదా బటానీ కర్రీలతో తింటే యమ్మీగా ఉంటుంది.   

6 /6

కానీ పూరీలను ఎక్కువగా తింటే.. మాత్రం ఫెస్ మీద మొటిమలు వస్తాయి. పూరీలు తింటే.. కొందరికి ఎక్కువగా దాహాం వేయడంతో పాటు డల్ గా నిద్ర వచ్చినట్లు ఉంటుంది.