Sobhita Dhulipala Chaitu wedding: నాగచైతన్య , శోభితల పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. నిన్నరాత్రి (డిసెంబరు4)న రాత్రి 8 గంటల తర్వాత జరిగిన వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చైతు, శోభితల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. అన్న పూర్ణ స్టూడియోస్ లో కుటుంబ సభ్యులు, కొద్ది మంది అతిథులు మధ్యలో వీరి పెళ్లి వేడుక సంప్రదాయ బద్దంగా జరిగినట్లు తెలుస్తొంది.
చైతు తెల్లని రంగు పంచ కట్టుకొగా, శోభిత బంగారు వర్ణంచీరను కట్టుకుని పుత్తడి బొమ్మలా మెరిసిపొవడం కన్పిస్తుంది. అయితే.. నాగార్జున వీరి పెళ్లి ఫోటోలను తమ సోషల్ మీడియాలో అకౌంట్ లో పంచుకున్నారు.
అదే విధంగా కొత్త కోడలుని ఆశీర్వదిస్తు.. తన కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానించారు. మరొవైపు అక్కినేని అభిమానులు సైతం.. చైతు, శొభితలకు ప్రత్యేకంగా విష్ చూశారు.ఈ క్రమంలో చైతు.. పెళ్లి పందిరిలో శోభితకు మూడు ముళ్లు కట్టేటప్పుడు.. అఖిల్ విజిల్ కొడుతూ హల్ చల్ చేశారు
పచ్చని పందిరిలో.. చైతు, శొభితల పెళ్లి చూసి నాగార్జునతో పాటు అమల, కుటుంబ సభ్యులు ఎంతో ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాగచైతన్య మాజీ భార్య సమంత రూత్ ప్రభు తాజాగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
చైతు పెళ్లి తర్వాత..సామ్ ఇన్ స్టాలో పోస్ట్ చేయడం కాస్తంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకొవచ్చు. అయితే.. సామ్.. ఇటీవల సిటాడెల్ హనీ బన్నీ.. వెబ్ సిరిస్ ను తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ వెబ్ సిరిస్ టీమ్ వారి ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసి.. ఈ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే గురించి ఆమె తన జర్నీ గురించి మరల గుర్తు చేసుకుంది. ఈ వెబ్ సిరిస్ తీసినప్పుడు తమది మర్చిపోలేని జర్నీ అని.. వీరితో పనిచేయడం ఫుల్ హ్యపీగా అన్పించిందని సామ్ రాసుకొచ్చారు.
అంతకుముందు ఫైట్ లైక్ ఎ గర్ల్ అంటూ ఓ చిన్న పాప, బాబుతో రెజ్లింగ్ చేస్తున్న వీడియోను కూడా ఆమె స్టోరీస్ లో పోస్ట్ చేసినట్లు తెలుస్తొంది. అంతేకాదు ఫైట్ చేస్తే ఈ అమ్మాయిలాగా చేయాలంటూ కామెంట్ జతచేసినట్లు తెలుస్తొంది. అయితే.. చైతు, పెళ్లికి ఈ పోస్ట్ కు ఎలాంటి సంబంధంలేదని తెలుస్తొంది.
సామ్ మాత్రం.. తన తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్లు తెలుస్తొంది. మరోవైపు తన మాజీ భర్త.. పెళ్లి చేసుకుని ఫుల్ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. వీరి పెళ్లిపై సామ్ ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తొంది. కానీ కొంత మంది మాత్రం.. సిటాడెల్ బన్నీ గురించి సామ్ పోస్ట్ చేస్తే... చైతు గురించి పోస్ట్ చేసిందని కొందరు నెటిిజన్లు అనుకున్నారంట. దీంతో ఇది వార్తలలో నిలిచింది.