Sneha: చీరలో మెరిసిన స్నేహ.. మరోసారి ప్రియమైననీకు రోజులు గుర్తుచేసిన హీరోయిన్

Sneha Pics: సావిత్రి.. సౌందర్య తరువాత.. సాంప్రదాయపద్ధమైన హీరోయిన్ గా అంతటి పేరు తెచ్చుకున్న మరో హీరోయిన్ స్నేహ. ప్రస్తుతం స్నేహ ఇంస్టాగ్రామ్ లో చీరలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  • Jan 13, 2024, 20:49 PM IST
1 /6

Sneha Viral Pics: తమిళ సినిమాలలో ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న స్నేహ… తెలుగులో హనుమాన్ జంక్షన్ ..ప్రియమైన నీకు లాంటి చిత్రాలతో పరిచయమై ఇక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది.

2 /6

ముఖ్యంగా ప్రియమైన నీకు సినిమాలో స్నేహా నటన ఇప్పటికీ ఎంతోమందికి గుర్తుంటుంది. మనసున ఉన్నది.. పాటతో అందరి మనసులో నిలిచిపోయింది ఈ హీరోయిన్..

3 /6

ఆ తరువాత స్టార్ హీరోల సినిమాలలో సైతం అవకాశాలు దక్కించుకుంది. శ్రీకాంత్ తో రాధాగోపాలం.. వెంకటేష్ తో సంక్రాంతి లాంటి మంచి ఫ్యామిలీ సినిమాలలో నటించి మెప్పించింది.

4 /6

కొద్ది సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక ముఖ్యపాత్రలో కనిపించింది. ఇక గత కొద్ది రోజుల నుంచి కేవలం అడ్వటైజ్మెంట్స్ లో మాత్రమే కనిపిస్తున్న స్నేహ.. తాజాగా తమిళ హీరో విజయ్ తో జోడిగా నటించనుంది.

5 /6

విజయ్ సినిమా GOAT లో స్నేహ మొదటి విజయ్ కి భార్యగా కనిపించనుంది అని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అందమైన ఆరెంజ్ చీరలో స్నేహ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

6 /6

చీరలో మెరిసిపోతూ.. స్నేహ షేర్ చేసిన ఈ ఫోటోలు మరోసారి ప్రియమైన నీకు రోజులను గుర్తు చేస్తున్నాయి. ఆ సినిమాలో స్నేహ ఎలా ఉండేదో.. ఇప్పుడు ఈ ఫోటోలో కూడా అంతే యంగ్ గా కనిపిస్తూ ఉండడంతో.. అభిమానులు స్నేహ అందం గురించి తెగ కామెంట్లు పెడుతున్నారు.