Snake facts: పాములు తరచుగా ముంగీసలతో కొట్లాడుతుంటాయి. కొన్నిసార్లు ముంగీస గెలిస్తే.. మరికొన్నిసార్లు పాము విన్ అవుతుంది. కానీ పాము విషం అనేది ముంగీసకు ఎక్కదంటారు.
కొన్ని జంతువులు సాధారణంగా జాతీవైరాన్ని కల్గి ఉంటాయి. కుక్కలు, పిల్లులు, కోతులు అనేవి ఎదురు పడితే కొట్లాడుకుంటాయి. క్రూర జంతువులు, సాధు జంతువుల్నివేటాడి తినేస్తుంటాయి. అడవిలో జంతువులు ఆహారం కోసం ఇతర జంతువుల్ని వేటాడి తినేస్తుంటాయి. ఇదిమనం తరచుగా చూస్తునే ఉంటాం.
ఇక పాములు గురించి తరచుగా ఆసక్తికర అంశాలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. నెటిజన్లు సైతం పాముల విషయాలపై తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పాముల వైరల్ వీడియోలు తరచుగా వైరల్ అవుతునే ఉంటాయి. పాములలో అన్ని కూడ విషపూరితమైనవి కావు. కేవలం కొన్ని మాత్రమే అత్యంత విషపూరిమైనవిగా ఉంటాయని చెప్పుకొవచ్చు.
కొన్ని జంతువులకు మధ్య జాతీవైరముందని చెబుతుంటారు. ముంగీస, గద్ద వంటి వాటితో పాముకు అస్సలు పడదంటా. వీటికి పొరపాటున పాములు కన్పిస్తే.. పట్టుకుని తినేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ముఖ్యంగా ముంగీసకు పాము వాసన వస్తుందంట. అందుకే అది పదికిలోమీటర్ల దూరం ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తుందంట. పాములు,ముంగీసలు తరచుగా కుస్తీలు పడుతుంటాయి.
పాములు ముంగీసలు గొడవపడుతుంటాయి. ముంగీస పాము పడగను పట్టుకుని తినేయాలని ప్రయత్నిస్తుంది. అదే విధంగా.. పాము ముంగీస బారి నుంచి బైటపడటానికి నానా తంటాలు పడుతుంది. దీనిలో భాగంగా పలు మార్లు ముంగీసను కాటు వేస్తుంది. కానీ చాలా వరకు ముంగీసకు ఏంకాదు. దీని వెనుక సీక్రెట్ ఉందంట. ముంగీస శరీరంలో కొన్నిహర్మోన్ లు ఉంటాయంట. ఇవి పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తాయంట.
అందుకే.. పాము విషం ఒక మోతాదు వరకు ఇమ్యూన్ చేసుకునే శక్తి ముంగిసలో ఉంటుందంట. ముఖ్యంగా.. ముంగిసలో ఉండే ఎసిటైల్ కోలిన్ గ్రాహకాలు, పాము విష ప్రభావం చూపకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా.. మితంగా విషం శరీరంలో ప్రవేశించినా గ్లైకో ప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవటం ద్వారా ప్రాణాపాయం నుండి గట్టెక్కుతాయి.
ముంగీసల ఒంటిపై కవచం మాదిరిగా బొచ్చు ఉంటుంది. ఇది పాము కాటును ముంగీస శరీరంకు తాకకుండా కాపాడుతుంది. అందుకే పాములు ముంగీస కాళ్లు, ముఖంపైకాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. ముంగీస కూడా అంతే చాకచక్యంగా వ్యవహరించి, పాము నోటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ముంగిసల్లో మొత్తంగా 29 రకాల జాతులు ఉన్నాయని చెప్తుంటారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)