Small Business Ideas 2024: ఆశ్చర్యపోకండి.. ఖాళీ సమయంలో ఇలా మొక్కలు పెంచి.. 3.5 లక్షలు సంపాదించండి!

Small Business Ideas With Bonsai Plants:  ప్రస్తుత కాలంలో చాలామంది ఏదైనా బిజినెస్ ను స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ  ఏ బిజినెస్‌ స్టార్ట్ చేయాలి? ఎలాంటి వాటికి లాభాలు అధికంగా ఉంటాయి అనే సందేహాలతో ఇబ్బంది పడుతుంటారు. బిజినెస్‌ లో చిన్న, పెద్దా వ్యాపారాలు అనే తేడా ఉండదు. ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా అందులో మెరుగైన లాభాలు ఉంటాయి. అయితే ఈ రోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌ ఎంతో సులభమైనది అలాగే ప్రకృతికి సంబంధించినది.  ఇంట్లోనే కూర్చొని లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఇంతకీ ఈ బిజినెస్‌ అంటీ ఎలా స్టార్ట్‌ చేయాలి? అనే వివిరాలు ఇక్కడ తెలుసుకుందాం. 
 

1 /7

నేటికాలంలో చాలా మంది మొక్కలను పెంచడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది ఇంట్లోనే చిన్న చిన్న కూరగాయలను, పువ్వుల మొక్కలను పెంచుతున్నారు. ఇది పర్యావరణానికి అలాగే ప్రశాంతతకు  ఎంతో సహాయపడుతున్నాయి. అయితే కొంతమంది బోన్సాయ్ మొక్కలను పెంచడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. ఈ మొక్కలను ఇంట్లో, ఆఫీస్‌లో, ఇతరులకు గిఫ్ట్‌ గా ఇవ్వడానికి మంచి ఎంపిక. 

2 /7

బోన్సాయ్  కేవలం మొక్కలు మాత్రమే కాదు, అవి కళ, శ్రద్ధ, సహజ ప్రకృతితో మన మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే మొక్కలు. వీటిని పెంచడం వల్ల ప్రశాంతతను పొందవచ్చు. చూడడానికి ఎంతో చిన్నగా , అందంగా ఉంటాయి. ఇది జపాన్‌కు చెందిన మొక్క.   

3 /7

 'బన్' అంటే పాత్ర లేదా తొట్టి, 'సై' అంటే పెంపకం అని దీని ఆర్థం. ఇది కేవలం తొట్టిలో పెంచడం మాత్రమే కాదు. ఇది ఒక ప్రత్యేకమైన కళా రూపం. వీటికి ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు. వీటిని సూరక్షితమైన ప్రదేశంలో పెంచడం వల్ల మొక్కులు అద్భుతంగా పెరుగుతాయి.   

4 /7

ఈ మొక్కలతో మనం బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తే అద్భుతమైన లాభాలు పొందవచ్చు. ఈ వ్యపారం మొదలు పట్టడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా స్టార్ట్‌ చేసిన బోలెడు లాభాలు కలుగుతాయి. బోన్సాయ్ మొక్కలు పెరగడానికి కేవలం  రెండు నుంచి ఐదు నెలలు పడుతుంది.  

5 /7

ఈ బిజినెస్‌ను ఇంట్లో లేదా చిన్న నర్సరీతో కూడా ప్రారంభించవచ్చు. ముక్కలు తెచ్చి 30 నుంచి 50 శాతం వరకు అమ్మచ్చు. ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి కేవలం రూ. 20,000తో  ప్రారంభించవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో  బోన్సాయి మొక్కలకు రూ.200 నుంచి రూ.2500 వరకు పలుకుతోంది.

6 /7

ఈ బిజినెస్‌ మొదలు పెట్టడానికి ఆదాయం లేకపోతే ప్రధాని మోదీ ముద్రలోన్‌ తో సహాయం పొందవచ్చు. 3 ఏళ్లలో ఒక్కో మొక్క రూ. 240 అవుతుంది ఈ లోన్‌ ద్వారా ఒక్కో మొక్కకు రూ.120 ప్రభుత్వ సాయం అందిస్తుంది. ఒకవేళ నర్సరీతో స్టార్ట్‌ చేయాలి అనుకునేవారికి ప్రభుత్వం ఆ ప్రాంతంలో విలువ చేసే రేటుకు తగ్గినంత పెట్టుబడిని అందిస్తుంది. అదనపు సమాచారం కోసం జిల్లాలోని నోడల్ అధికారిని సంప్రదించి కూడా  తెలుసుకోచ్చు.   

7 /7

బోన్సాయి మొక్కలను ఒక హెక్టారులో 1500 నుంచి 2500 మొక్కలు నాటవచ్చు. ఇలా నాలుగు ఏళ్లు తర్వాత మీరు సులువుగా రూ. 3 లక్షల నుంచి  రూ.  3.5 లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ సాగు వల్ల రైతులకు కూడా ఎంతో మేలు కలుగుతుంది.