Top Small Business Ideas 2024: ఇది యాపరం.. గవర్నమెంట్ స్కీమ్ లో రూ.5 వేలు కట్టు.. నెలకు 50 వేలు కొట్టు..

2024 Small Business Ideas: ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) అనేది భారతదేశంలో ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఈ పథకంతో నెలకు రూ. 50 వేలు సంపాదించవచ్చు. ఈ బిజినెస్‌ ఎలా స్టార్ట్‌ చేయాలి..? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 


2024 Small Business Ideas: నేటి యువత ఉద్యోగాల కంటే సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం వల్ల రెట్టింపు లాభం వస్తుందనే ఆలోచన చాలా మంది భావిస్తున్నారు. అయితే వ్యాపారంలో లాభం అనేది గ్యారంటీ కాదు. చాలా మంది వ్యాపారాలు నష్టానికి గురవుతాయి. వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి, మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి, పోటీని ఎదుర్కోవాలి. ఇప్పటికే చాలా మంది చిన్న బిజినెస్‌లను స్టార్ట్‌ చేసి విజయాలను పొందుతున్నారు. చిన్న బిజినెస్‌ల కోసం ఎక్కువగా పెట్టుబడి అవసరం ఉండదు. మీరు చిన్న బిజెనెస్‌లను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కీంతో  నెలకు రూ. 50 వేల సంపాదించవచ్చు.  

1 /9

ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రం తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం.  

2 /9

ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక స్కీం. ఈ స్కీం ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలకు నాణ్యమైన ఔషధాలు అందించడమే ప్రధాన లక్ష్యం.

3 /9

జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించడానికి అధిక పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. బ్రాండెడ్  ఔషధాల కంటే చాలా తక్కువ ధరలో మందులు లభిస్తాయి. దీని వల్ల మంచి లాభాలు పొందవచ్చు. 

4 /9

ఈ బిజినెస్‌ స్టార్ట్ చేయాలంటే డి. ఫార్మా లేదా బి. ఫార్మా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ అర్హత మీకు ఔషధాల గురించి సరైన జ్ఞానాన్ని ఇస్తుంది. దీంతో పాటు 120 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఈ స్థలంలో మీరు కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు.

5 /9

మీ దగ్గరి జిల్లా ఔషధ నియంత్రణ అధికారిని సంప్రదించి, జనౌషధి కేంద్రం కోసం నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దీని కోసం రూ. 5 వేల చెల్లించాల్సి ఉంటుంది. 

6 /9

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, అవసరమైన పత్రాలతో సహా సమర్పించాలి. దరఖాస్తుతో పాటు, డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, స్థలం  పత్రాలు మొదలైనవి సమర్పించాలి.  

7 /9

ఆ తరువాత ప్రభుత్వం నిర్వహించే శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనాలి. ఈ శిక్షణలో మీకు ఔషధాల గురించి, కేంద్రాన్ని ఎలా నిర్వహించాలి అనే విషయాల గురించి తెలియజేస్తారు.

8 /9

షాప్‌ ఫర్నీచర్‌ కొనుగోలు కోసం కూడా ప్రభుత్వం  రూ. 1.5 లక్షల వరకు సాయం అందిస్తుంది. దీంతో పాటు కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఇంటర్నెట్ తదితరాల కోసం రూ.50 వేల  అందిస్తున్నది. 

9 /9

ఈ బిజినెస్‌తో నెలకు రూ. 50 వేల ఆదాయం సంపాదించవచ్చు. వ్యాపారం మొదలు పెట్టడం కోసం అధికారిక వెబ్ సైట్ janaushadhi.gov.in ను సంప్రదించవచ్చు.