Wines shops closed news: దసరా పండగ వేళ మందుబాబులకు ఆబ్కారీ అధికారులు షాకింగ్ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అన్ని లిక్కర్, వైన్ షాపుల్ని మూసి ఉంచాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా కూడా దసరా పండగ సందడి నెలకొంది. జనాలు అంత తమ సొంతళ్లబాట పట్టారు. ఇదిలా ఉండగా.. పండగ వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో నాన్ వెజ్, మందు తప్పకుండా ఉండాల్సిందే.
రేపు (శనివారం )దేశ వ్యాప్తంగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈరోజు చాలా మంది ఒకవైపున అమ్మవారిని పూజించడంతో పాటు, మరోవైపు నాన్ వెజ్, లిక్కర్ లను కూడా తప్పకుండా తాగుతుంటారు. మందు, ముక్కలేనిది పండగ అంతా ఛీల్ అన్పించదని చాలా మంది భావిస్తారు.
కనీసం ఒక్క పెగ్గు అయిన ఆరోజు గడవదని కూడా చెప్తుంటారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో మందుబాబులకు మాత్రం ఆబ్కారీ శాఖ అధికారులు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఇది కేవలం తెలంగాణలోని నిర్మల్ జిల్లా వాసులకు మాత్రమే అని తెలుస్తోంది. గతరాత్రి సద్దుల బతుకమ్మ ఘనంగా జరగ్గా... రేపు విజయ దశమి దసరా జరుపుకోనున్నారు.
దసరా పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో 2 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు గురువారం (అక్టోబర్ 10) రోజున ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిర్మల్లో ఈనెల 12న దుర్గాదేవి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. నేటి ఉదయం అంటే..(శుక్రవారం).. 10 నుంచి ఆదివారం (అక్టోబర్ 13) ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు.. ముధోల్, భైంసాలో 13న దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా శనివారం (అక్టోబర్ 12) ఉదయం 10 నుంచి సోమవారం (అక్టోబర్ 14) ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు. అక్కడ .. సున్నితమైన ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. పండగ అంటేనే చుక్క, ముక్క అనిచెబుతుంటారు. అలాంటిది చుక్క లేకుంటే ఎలా అని.. పలువురు మందుబాబులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దసరా రోజు చాలా మంది మందుతాగి ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సమయంలో తమ షాపులో క్లోజ్ ఉంచితే.. తమకు భారీగా నష్టం వస్తుందని లిక్కర్ షాప్ ఓనర్స్ మాత్రం ఆందోలన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.