Shreya Ghoshal pics: శ్రేయాఘోషల్​ సింగర్ మాత్రమే కాదు.. చందమామలాంటి రూపం ఆమె సొంతం

Shreya Ghoshal pics: శ్రేయాఘోషల్‌ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సింగర్స్​ గురించి ప్రస్తావన వస్తే అందులో ఈమె పేరు కచ్చితంగా ఉంటుంది. అంతటి ప్రతిభ ఈమెది. అంతే కాదండోయ్​ చందమామలాంటి అందమైన రూపం శ్రేయాఘోషల్ సొంతం. మరి ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

  • Apr 05, 2022, 22:55 PM IST
1 /5

శ్రేయాఘోషల్ 1984లో పశ్చిమ్​ బెంగాల్​లో జన్మించింది. అయితే ఆమె పెరిగింది మాత్రం రాజస్థాన్​లోని కోటాకు సమీపంలో ఓ చిన్న టౌన్​లో.

2 /5

జీ టీవీలో వచ్చే స రె గా మా పా.. సింగింగ్ టాలెంట్ షో ద్వారా 2000 సంవత్సరంలో విజయం సాధించి. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

3 /5

2002లో వచ్చిన హిందీ చిత్రం దేవ్​దాస్ ద్వారా నేపథ్య గాయనిగా మారింది శ్రేయాఘోషల్​. ఆ తర్వాత ఇతర భాషల్లోనూ అవకాశాలు మొదలయ్యాయి.

4 /5

శ్రేయాఘోషల్​ 2015లో వ్యాపారవేత్త శీలాదిత్య ముక్తోపాద్యాయను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు.

5 /5

హిందీ తర్వాత.. కన్నడ, తెలుగు సినిమాల్లోనే అత్యధికంగా పాటలు పాడారు శ్రేయా ఘోషల్​. ఇప్పటి వరకు మొత్తం 2,400 పై చిలుగు పాటలు పాడటం విశేషం.