Car Mileage: మీ కారు మైలేజ్ తగ్గిపోయిందా, ఈ టిప్స్ పాటించి చూడండి

Car Mileage: కారు కొనుగోలు చేయడం కంటే దాని నిర్వహణే కష్టం. ఎందుకంటే ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకే మైలేజ్ ఎక్కువగా ఇచ్చే కార్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. 

Car Mileage: అదే సమయంలో మీ కారు మైలేజ్ ఎక్కువ ఇచ్చేలా కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. ఇవి పాటిస్తే మైలేజ్ కచ్చితంగా పెరుగుతుంది. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..
 

1 /5

కారు ఎప్పుడూ ఓవర్ లోడింగ్ ఉండకూడదు. ఓవర్ లోడింగ్ ఉండే కారు ఇంజన్‌పై ఒత్తిడి పెరిగి ఇంధనం వాడకం పెరిగిపోతుంది. ఫలితంగా మైలేజ్ తగ్గిపోతుంది. 

2 /5

కిటికీలు తెరిచి ప్రయాణం చేస్తే కారు ఇంజన్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దాంతో ఇంధనం వాడకం పెరుగుతుంది. మైలేజ్ బాగుండాలంటే కారు కిటికీలు మూసివేసి ఉండాలి.

3 /5

టైర్ ప్రెషర్ కూడా సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. టైర్ ప్రెషర్ సరిగ్గా ఉండటం కూడా మైలేజ్‌పై ప్రభావం చూపిస్తుంది. 

4 /5

స్మూత్ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యం. ఎక్సిలేటర్, బ్రేక్ వాడకం సాధ్యమైనంతవరకూ తగ్గించాలి. కారుని స్మూత్ డ్రైవింగ్‌తో స్థిరమైన వేగాన్ని మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మంచి మైలేజ్ ఇస్తుంది. 

5 /5

కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి. ఇంజన్, బ్రేక్, సస్పెన్షన్ ఇతర ఎలాగున్నాయో చెక్ చేస్తుండాలి. సర్వీసింగ్ బాగుంటే కారు పనితీరు బాగుంటుంది. మైలేజ్ కూడా అధికంగా ఉంటుంది.