Independence india: స్వాతంత్య్రం తరువాత క్రీడారంగంలో ఇండియా సాధించిన విజయాలు

Independence india: 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. ఇక అప్పట్నించి ప్రారంభమైన భారతదేశ ప్రయాణం అప్రతిహంగా ముందుకు కొనసాగింది. అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంది. నలుగురిలో గర్వంగా నిలబడేలా చేసింది.

Independence india: అన్ని రంగాల్లో సామర్ధ్యం నిరూపించుకున్నట్టే ఆటల్లో కూడా ఇండియా ప్రత్యేకత నిలుపుకుంది. స్వాతంత్య్రం తరువాత దేశం వివిధ ఆటల్లో సాధించిన కొన్ని మైలురాళ్ల గురించి తెలుసుకుందాం..

1 /8

మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని టీమ్ ఇండియా 2007 తొలి టీ20 ప్రపంచకప్ గెల్చుకుంది.   

2 /8

2004 ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల షూటింగ్ విభాగంలో రాజ్యవర్ధన్ రాధోడ్ రజత పతకం సాధించాడు.  

3 /8

2000 సెప్టెంబర్ 19 ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం గెల్చుకున్న తొలి మహిళగా కరణం మల్లేశ్వరి రికార్డు సాధించింది. 

4 /8

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఇండియా అగ్రస్థానంలో ఉంది. కానీ 80వ దశకంలో పసికూన మాత్రమే. ఆ సమయంలోనే 1983 ప్రపంచకప్ టైటిల్ గెల్చుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాడు కపిల్ టీమ్ వేసిన బీజమే నేడు మహా వృక్షమై వెలుగుతోంది.

5 /8

మాజీ  ఆటగాడుప్రకాష్ పడుకోన్ 1980లో ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచాడు. 1981లో రన్నరప్ గా ఉన్నారు. 2001లో ఇండియా పుల్లెల గోపీచంద్ విజయం సాధించాడు.

6 /8

హాకీ ప్రపంచకప్ 1975లో తొలిసారి పాకిస్తాన్‌పై గెలిచి సాధించింది. సుర్జీత్ సింగ్ చేసిన పెనాల్టీ కార్నర్ గోల్‌తో ఈ విజయం దక్కింది.

7 /8

1948, 1952 ఒలింపిక్ క్రీడల్లో ఇండియా ఖషాభా జాదవ్ 1952 హెల్సింకీ ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెల్చుకున్నాడు.

8 /8

ఆగస్టు 15,1947న స్వాతంత్య్రం పొందిన తరువాత భారతదేశం ఆటల్లో అద్భుతంగా రాణించింది. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ రంగాల్లో కీలక విజయాలు నమోదు చేసింది.