Remedies For Effects Of Shani: నవగ్రహాల్లో శని గ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గ్రహం న్యాయం, కర్మ ఫలాలకు అధిపతిగా పరిగణించబడుతుంది. జాతక చక్రంలో శని గ్రహం శుభస్థానంలో ఉన్నప్పుడు రాజయోగాన్ని ప్రసాధిస్తాడు. కానీ శని గ్రహం నీచస్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం వంటి కష్టాలు కలుగుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంది పండితులు దోష నివారణ చేయాల్సి ఉంటుందని చెబుతుంటారు. కొంతమంది దానాలు, పూజలు, శాంతి పూజలు చేస్తుంటారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే శని గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దోషం అనేది వ్యక్తి జాతకాన్ని పరిశీలించి చెబుతుంటారు. శని గ్రహం రాశిపై ప్రభావం చూపించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీని శని దోషంగా భావిస్తారు పండితులు.
శని దోషం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు, గొడవలు, కుటుంబ సభ్యులతో కలతలు ఏర్పుడుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. ఏ పని చేసిన ఆలస్యం అవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
శని దోషాలను తొలగించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే కిచెన్లో కొన్ని పదార్థాలను ఉపయోగించి తొలగించుకోవచ్చు.
మీరు ఎటు వంటి ఖర్చు లేకుండా ఏలాంటి దానాలు చేయకుండా ఈ పదార్థాలతో శని దోషాన్ని తొలగించుకోవచ్చు.
వంట గదిలో ఎల్లప్పుడు ఉండే నల్ల మిరియాలను తీసుకొని తల చుట్టూ 7 సార్లు తిపి నాలుగు దిక్కులు కలిసే రోడ్డులో విసిరేయాలి. వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చి కళ్ళు, చేతులు కడుకోవాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అనుకున్న పనులు త్వరగా ముందు కొనసాగాలంటే గుమ్మం మీద కొన్ని నల్ల మిరియాలు పెట్టుకొని వాటిని తొక్కాలి. ఆ తరువాత ఇంటి నుంచి కుడి కాళ్ళు పెట్టి బయటకు వెళ్ళితే పనులు పూర్తి అవుతాయి.
తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు, నరదృష్టితో బాధపడుతున్నవారు ఇంటిలో ఉండే ఏ మూలలో అయితే దీపాని పెట్టి అందులోకి ఎనిమిది నల్ల మిరియాలు వేయాలి. ఇలా చేయడం వల్ల ఇతరలు నుంచి డబ్బులు తిరిగి వస్తాయి, నరదృష్టి తగ్గుతుంది.
గమనిక: ఇక్కడ తెలిపిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే.