Shanidev Effect: శనిదోషంతో బాధపడుతున్నారా..?.. ఒకే ఒక్క పరిహారం.. వంద ప్రయోజనాలు.. జ్యోతిష్యుల సూచనలు మీకోసం..

Astrology tips: శనిదేవుడు ,శనివారం, శనిదోషం పరిహారాలు, జ్యోతిష్యప్రయోజనాలు, చాలా మంది శనిదోషంతో తెగ కష్టాల పాలౌతుంటారు. శని ప్రభావం వల్ల ఓడలు బండ్లు అవుతాయి. అదే విధంగా బండ్లు కూడా ఓడలు అవుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. కానీ కొన్ని పరిహారాలు పాటిస్తే మాత్రం.. శనిదోషం ప్రభావం నుంచి ఈజీగా బైటపడోచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

1 /6

మనలో చాలా మంది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతుంటారు. కానీ శనిదేవుడు మాత్రం మనం చేసే కర్మలను బట్టి పనిష్మెంట్ ఇస్తాడని చెబుతుంటారు. మనం మంచి పనులు చేస్తే, మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే చెడు ఫలితాలను ఇస్తుంటాడు.

2 /6

ముఖ్యంగా శనిదేవుడిని ప్రతిఒక్కరాశులలో కొన్ని ఏళ్లపాటు ఉంటూ కర్మలకు తగిన విధంగ ఫలితాలు ఇస్తుంటాడు. శనిదేవుడికి ముఖ్యంగా శనివారం అంటే ఎంతో ప్రీతి అని చెబుతుంటారు. ఈరోజు ఏ పనిచేసిన కూడా శనిదేవుడు మంచి ఫలితాలను ఇస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

3 /6

శనివారం రోజున.. శునకాలకు కానీ, కాకులకు , నల్ల చీమలకు ఏదైన ఆహారం ఇస్తే మనకు ఉన్న దోషాలన్ని ఇట్టే తొలగిపోతాయి. కాకి అనేది , శనిదేవుడికి వాహనమని చెబుతుంటారు. నల్లచీమలకు చక్కెరను ఆహారంగా ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి.  

4 /6

అదే విధంగ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని కొలిచిన కూడా ఆయన మనకు మంచి ఫలితాలు ఇస్తారని చెబుతారు. ఇక ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించాలి. శనిదేవుడి విగ్రహానికి నల్లనువ్వులను సమర్పించాలి..  

5 /6

శనిదేవుడి విగ్రహానికి నూనెతో, నల్లనువ్వులతో అభిషేకం చేయాలి. నల్లని బట్టలను సమర్పించాలి. ఇలా చేస్తే శనిదోషం నుంచి బైటపడి జీవితంలో అనేక ప్రయోజనాలు కల్గుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

6 /6

శనిదేవుడికి అనుగ్రహం కోసం పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తే కూడా మంచి జరుగుతుందని చెబుతుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)