Ujjaini Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. అమ్మవారి ఆవిర్బావం ఎలా జరిగిందో తెలుసా..?

Mahankali jatara: జంటనగరాలలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిందని చెప్పుకోవచ్చు. ఈ సారి  జులై  21,22 తేదీలలో లష్కర్ అమ్మవారి బోనాల పండగను వేడుకగా నిర్వహించనున్నారు. 

1 /8

ఆషాడ మాసంలో బోనాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను అధికారిక ఫెస్టివల్ గా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ఊరువాడ, పల్లెపట్నం అని తేడాలేకుండా బోనాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బోనాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు.

2 /8

ఇప్పటికే గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో  వేడుక ప్రారంభమయ్యింది. అదే విధంగా హైదరబాద్ లోని అన్నిప్రధాన ఆలయాల్లో కూడా బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ఇటీవల బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో బోనాలు, కళ్యాణం కూడా ఎంతో వేడుకగా జరిగాయి. ఈ క్రమంలో జులై 21,22 రెండు రోజుల పాటు ఉజ్జయినీ అమ్మవారి ఆలయంలో బోనాలు జరుగనున్నాయి. 

3 /8

సికింద్రాబాద్ లో  జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. ఇక్కడ అమ్మవారిని ఉజ్జయినీ మహంకాళి అని పిలుస్తారు. దీని వెనుక అమ్మవారి మహత్యం కల్గిన ఒక చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. బ్రిటీష్ ఆర్మలో పనిచేసే ఉద్యోగి అమ్మవారి ఆలయంను నిర్మించాడు. సికింద్రాబాద్ లోని పాత బోయిగూడకు చెందిన సురటి అప్పయ్య బ్రిటీష్ ఆర్మీలో పనిచేసేవాడు. అతన్ని 1813 లో మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినికి ట్రాన్స్ ఫర్ చేశారు.

4 /8

ఆ సమయంలో ఒక్కసారిగా కలరా వ్యాప్తి చెందింది. వేలాది మంది చనిపోయారు. అప్పుడు అప్పయ్య.. ఉజ్జయినీ అమ్మవారికి కలరా తగ్గేలా కాపాడాలని మొక్కులు మొక్కుకున్నాడు. తన గ్రామంలో ఉజ్జయినీ ఆలయం కట్టిస్తానని దండంపెట్టుకున్నాడు.అమ్మవారి అనుగ్రహంతో అనతి కాలంలోనే.. కలరా మాయమైపోయింది. 

5 /8

వెంటనే అప్పయ్య.. తన మిత్రులకు ఉజ్జయినీ అమ్మవారి మహత్యం గురించి చెప్తాడు. వెంటనే 1815 లో సికింద్రాబాద్ వచ్చేశాడు. బంధుమిత్రుల సహకారంతో పాతబోయిగూడ బస్తీకి సమీపంలోని ఖాళీ స్థలంలో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగా నామకరణం చేశారు. ప్రతి రోజు పూజలుచేస్తు, 1815 నుంచి ఆషాడంలో బోనాలు సమర్పిస్తున్నారు.

6 /8

జాతర కోసం వచ్చే భక్తుల కోసం బావిలో మరమ్మత్తులు చేస్తుండగా.. అమ్మవారి విగ్రహాం లభ్యమైంది. మాణిక్యాల అమ్మవారి విగ్రహంను ఆలయంలో ప్రతిష్టించారు. ఆ తర్వాత అప్పయ్య కుటుంబ సభ్యులు ఆధునిక ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. మహంకాళి అమ్మవారి చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో భక్తులకు దర్శనమిస్తారు.

7 /8

అప్పటి నుంచి బోనాలు భక్తితో సమర్పించుకుంటు వస్తున్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటే.. అంటు వ్యాధులు తగ్గిపోవడంతో పాటు, సుఖసంతోషాలు కల్గుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. రెండు రోజుల ఇక్కడ  2 రోజుల పాటు బోనాలు ఘనంగా జరుపుకుంటారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు కూడా సమర్పిస్తారు. అనంతరం భక్తులు బోనాలను అనుమతిస్తారు. తొలిరోజు బోనాలు ఎక్కించగా రెండో రోజు అమ్మవారికి బలి, రంగం, గావు పట్టడం,తొట్లెల సమర్పణ, ఏనుగు అంబారీ ఊరేగింపులు వేడుకగా జరుగుతాయి.

8 /8

దేవదాయ శాఖ ఈసారి జోగినిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జోగినీలతో తొలిసారి ప్రభుత్వం చర్చలు  జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. జోగినీలు, శివసత్తులకు  ప్రత్యేకంగా సమయం కేటాయించారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 వరకు బాటా చౌరస్తా నుంచి రావాలని అధికారులు సూచించారు. ఇప్పటికే అధికారులు, ట్రాఫిక్, భక్తులకు ఇబ్బంది కల్గకుండా నీటి వసతి, క్యూలైన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు.