SBI Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉంటే..మీకో గుడ్ న్యూస్. రెండు కొత్త స్కీములను ప్రారంభించినట్లు స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిని పేర్లు హర్ ఘర్ లఖ్ పతి, ఎస్బీఐ పాట్రన్స్. ఈ రెండు పథకాల ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
SBI Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉంటే..మీకో గుడ్ న్యూస్. రెండు కొత్త స్కీములను ప్రారంభించినట్లు స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిని పేర్లు హర్ ఘర్ లఖ్ పతి, ఎస్బీఐ పాట్రన్స్. ఈ రెండు పథకాల ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. కొత్తగా రెండు డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ రెండు కొత్త డిపాజిట్ పథకాల పేర్లు హర్ ఘర్ లఖపతి , SBI పాట్రన్స్. కస్టమర్లకు మరింత ఆర్థిక సౌలభ్యం, మెరుగైన విలువను అందించడానికి ఈ ప్లాన్‌లను రూపొందించినట్లు బ్యాంక్ తెలిపింది.
ఆర్థిక భద్రత ను దృష్టిలో ఉంచుకుని, హర్ ఘర్ లఖ్‌పతి అనే స్కీము కస్టమర్‌లు రూ. 1,00,000 డిపాజిట్ చేయడంలో సహాయపడేందుకు రూపొందించిన రికరింగ్ డిపాజిట్ పథకం అని ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఉత్పత్తి ఆర్థిక లక్ష్యాలను సాధించే ప్రక్రియను సులభతరం చేస్తుందని, కస్టమర్‌లు సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడానికి, పొదుపు చేయడానికి వీలు కల్పిస్తుందని బ్యాంక్ తెలిపింది.
80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అయిన SBI ప్యాట్రన్స్‌ను కూడా బ్యాంక్ ప్రవేశపెట్టింది. చాలా మంది సీనియర్ కస్టమర్‌లు బ్యాంక్‌తో ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పత్తి మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇప్పటికే ఉన్న, కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు SBI పాట్రన్ అందుబాటులో ఉంది.
SBI పాట్రన్స్ డిపాజిటర్లు సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేటు కంటే 0.1 శాతం అధిక వడ్డీని పొందుతారు. అయితే రికరింగ్ డిపాజిట్ పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే రేట్ల మాదిరిగానే ఉంటుంది.
ప్రస్తుతం, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలవ్యవధి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటు 6.80 శాతం, రెండేళ్ల కంటే ఎక్కువ కాలం ఉంటే 7 శాతం, 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధికి 6.75 శాతం, 5-10 సంవత్సరాల కంటే ఎక్కువ 6.5 శాతం.
రికరింగ్ డిపాజిట్ కనీస వ్యవధి 12 నెలలు (ఒక సంవత్సరం) గరిష్ట కాలం 120 నెలలు (10 సంవత్సరాలు) ఉంటుంది.ఈ పథకం మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.