Samantha Photos: సమంత గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది ఈ హీరోయిన్. తాజాగా వినాయక చవితి రోజు సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి స్టార్ హీరోయిన్ గా …కొనసాగుతోంది సమంత. తను హీరోయిన్గా వచ్చి దశాబ్ద కాలం అవుతున్నా కానీ.. ఇంకా కూడా వరుస అవకాశాలు అందుకుంటూ.. కొత్త హీరోయిన్స్ కి సైతం గట్టి పోటీ ఇస్తోంది.
సినిమాల విషయం పక్కన పెడితే.. తన పర్సనల్ లైఫ్ ద్వారా ఎక్కువగా వార్తలో నిలుస్తూ వచ్చింది ఈ హీరోయిన్. తన మొదటి సినిమా హీరో నాగచైతన్య అని పెళ్లి చేసుకున్న సమంత.. ఆ తరువాత కొద్ది రోజులకు అతనితో వచ్చిన కొన్ని విభేదాల వల్ల.. విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుంచి వాళ్ల విడాకులకే గల కారణాలు.. ఎన్నో బయటకి వచ్చాయి.
కానీ ఇప్పటికీ కూడా అసలు కారణమేదో ఇరువురు బయట పెట్టలేదు. ఇదిలా ఉండగా ఈ మధ్యనే సమంత మాజీ భర్త నాగచైతన్య.. హీరోయిన్ శోభితతో నిశ్చితార్థం జరుపుకున్నారు. కాగా ఈ విషయంపై కూడా సమంత స్పందించలేదు. ప్రస్తుతం తన సినిమాలు చేసుకుంటూ తాను బిజీగా ఉంటోంది.
త్వరలోనే.. ఈ మధ్యనే తాను స్థాపించిన నిర్మాణ సంస్థ ద్వారా.. తెరకెక్కుతోన్న సినిమా మా ఇంటి బంగారంలో.. కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించనుంది. మరోపక్క బాలీవుడ్ లో సైతం సమంతకు వరస అవకాశాలు వస్తున్నాయి.
మరోపక్క ఇన్స్టాగ్రామ్ లో.. తరచూ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్. తాజాగా సమంత పూల పూల డ్రస్సులో షేర్ చేసిన ఫోటోలు.. తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.